Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Big TV Live 1 week ago

Intinti Ramayanam Today Episode july 31st:అవని మీ చెల్లెలు ఇంత మారిపోతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ అక్షయ్ అంటాడు. మీ చెల్లెలు పూర్తిగా మారిపోయింది కదా..

ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా అని అక్షయ్ ఎంత చెబుతున్నా సరే..అవని మాత్రం మీతో మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు అన్నట్లుగా పేపర్లో రాసి ఇస్తుంది. మీ చెల్లెలు మారిపోయిన కూడా నీలో ఎందుకు ఇంత మార్పు రావట్లేదు అని అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇకపోతే అక్షయ్ మీ చెల్లెలు మాట్లాడింది కదా ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అక్షయ్ ఎంతగా బ్రతిమిలాడిన సరే అవని మాత్రం అస్సలు వినదు. ఇకపోతే శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా రవీంద్ర ప్రసాద్ రాగానే ఇంట్లోని వాళ్ళందరూ పూర్తిగా మారిపోయారు అని చాలా సంతోషంగా ఉంటారు.. వీడు చాలా అదృష్టవంతుడు వీడి వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళిద్దరూ మురిసిపోతూ తమ కొడుకుపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.. పల్లవి మాత్రం అందరితో సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది కానీ అశ్విన్ ఫోన్ చేసి తనని ఇబ్బంది పెడతాడు.

మీనాక్షి ఫుల్ హ్యాపీ..

చక్రధర్ మీ అత్తయ్య వస్తానంది కదా మా ఇంకా రాలేదా అని ప్రణతిని అడుగుతాడు. అత్తయ్య వస్తానన్నారా ఇంకా రాలేదు మావయ్య ఏమైంది ఇక్కడికి వచ్చేస్తున్నారా అని తనది సంతోషంగా అడుగుతుంది. కానీ ఇక్కడికి ఉండిపోవడానికి రావడం లేదు. అమ్మ కేవలం మాట్లాడి వెళ్లడానికి వస్తుంది అని చక్కగా చెప్పగానే అయ్యో అవునా మావయ్య అత్తయ్య గారు వస్తున్నారని నేను సంతోషంగా ఉన్నాను అని ప్రణతి అంటుంది.. ఇక మీనాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఏమండీ నేను చాలా సంతోషంగా ఉన్నానండి.. పల్లవి నన్ను అమ్మ అని పిలిచింది అంటూ చాలా సంతోషంగా చెప్తుంది.. పల్లవిలో ఇంత సడన్గా మార్పు వచ్చింది అంటే.. ఏదో కారణం ఉంటుంది లేదా తను నటిస్తుంది అని చెప్పగానే మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్నాళ్ల తర్వాత నా కూతురు నన్ను అమ్మ అని పిలిచిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు అంటూ మీనాక్షి అనగానే సరే మీనాక్షి అని చక్రధరం అంటాడు.

అవని ఫుల్ హ్యాపీ..

పల్లవి ఇంతగా మారిపోతుందని అస్సలు ఊహించలేదని అవని తనలో తానే మురిసిపోతూ చాలా సంతోషంగా ఉంటుంది.. పల్లవిలో ఎంత మార్పు రావడం నేను అస్సలు సహించలేకపోతున్నాను.. ఇదంతా నిజం ఆ కల అని నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పగానే.. అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి పల్లవిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు కానీ ఇది నిజమేనా అబద్దమా అని నాకు కన్ఫ్యూషన్ లో ఉన్నాను అని అక్షయ్ అంటాడు.. కానీ అవని మాత్రం మీ చెల్లెలు మారిపోయింది కదా అని అనగానే చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి అవని మాట్లాడవు అని అక్షయ్ ఎంతగా మాట్లాడించాలని ప్రయత్నించిన సరే తను మాత్రం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతుంది.. మాట్లాడొచ్చు కదా అని అంటే నన్ను మాట్లాడించడానికి సారీ అని చెప్పాల్సిన అవసరం లేదు నాకు కోపం తగ్గించండి అని అవని సలహా ఇవ్వగానే పిచ్చెక్కిచ్చేస్తాను అని అక్షయ్ అనుకుంటాడు.

భానుమతికి షాకిచ్చిన పల్లవి..

పల్లవి పంట గదిలో వంట చేస్తూ చాలా పద్ధతిగా కనిపించడంతో భానుమతి నిన్నలా చూస్తూనే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఇంత మార్పు వచ్చిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఉత్తమ ఇళ్లలు క్యారెక్టర్ లో నువ్వు చాలా ఒదిగిపోయావు అంటూ మాట్లాడడంతో పల్లవి మౌనంగా ఉంటుంది. నువ్వు ఉత్తమ ఇల్లాలు క్యారెక్టర్ లో బాగానే ఒదిగిపోయావే నా ముందర కూడా నువ్వు ఇలా నటిస్తావా అని భానుమతి అడుగుతుంది.. మంచి దానివి అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నామని నాకు బాగా అర్థమైంది మరి నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అని భానుమతి అడగగానే పల్లవి చాలా కోపంగా ఉంటుంది.. చేతి మీద సాంబార్ పోస్తుంది. అయితే ఏంటే నువ్వు నా మీద సాంబార్ పోసావు అని భానుమతి అనగానే నేను మారిపోయాను అమ్మమ్మ అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది..

అక్షయ్, అవనిని కలిపే ప్రయత్నం..

అక్షయ్ ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటారు.. అక్కడికి వచ్చిన మిగిలిన తమ్ముళ్లు ఏమైందన్నయ్య నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావని అర్థమైంది.. ఏదో జరిగి ఉంటుంది అందుకే నువ్వు ఎలా ఉన్నావు అని అంటే ఫ్యామిలీ సమస్య రా అని అంటాడు.. ఫ్యామిలీ సమస్య ఏమైంది అని చెప్పగానే అవని మాట్లాడడం లేదు అన్న విషయాన్ని బయట పెడతాడు అక్షయ్. అదేనా అంత చిన్న విషయానికి మీరు ఇంతగా ఫీల్ అవ్వాలని అక్షయ్ కి భరోసా ఇస్తారు కానీ అక్షయ్ మాత్రం అవనీతో ఎలా మాట్లాడాలని టెన్షన్ పడిపోతూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live