Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు

Big TV Live 4 months ago

Inzamam-ul-haq : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంటులో ఇప్పటికే 30 కి పైగా మ్యాచులు పూర్తి అయ్యాయి.

మరో సగం మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ టోర్నమెంట్ ను చిన్నదిగా చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని టెస్ట్ ప్లేయర్ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ( Inzamam-ul-Haq) సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 బంతుల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్థ సెంచరీ చేస్తే… బాబర్ ( King Babar ) మాత్రం సెంచరీ చేయడం గ్యారంటీ అంటూ కితాబు ఇచ్చారు. ఏజ్ పైబడిన వాళ్లకు ఐపీఎల్ లో ఛాన్సులు ఇస్తున్నారని పరువు తీసే ప్రయత్నం చేశారు ఇంజమామ్. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Rohit Sharma Fitness Video : గంటకు 100 Push-Ups..రోహిత్ శర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను హైలెట్ చేయాలన్న లక్ష్యంతో ఇంజమం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప ఇంకేమీ ఉండదని బాంబు పేల్చారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని కూడా టార్గెట్ చేశారు. ఇస్లాం మతంలోకి మారితే విరాట్ కోహ్లీని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో హిందువులకు ఛాన్స్ ఇవ్వబోమని వెల్లడించారు ఇంజమామ్. ఒకవేళ విరాట్ కోహ్లీ మతం మారితే మాత్రం కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు.

అలాగే విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ అంటూ పరువు తీసే ప్రయత్నం చేశారు ఇంజమాం. 30 బంతులు ఎదుర్కొని విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ చేస్తే.. బాబర్ మాత్రం 50 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేస్తాడని తెలిపారు. ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు డేంజర్ ఆటగాడో? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్. ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేకపోయినా బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీ చేసినట్లు ఇంజమామ్ గుర్తు చేశారు. మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ చేయడానికి నాన తంటాలు పడుతున్నాడని దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటికైనా విరాట్ కోహ్లీని సెంచరీ చేసి చూపించాలని సవాల్ విసిరారు ఇంజమామ్. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ పనికిరాదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన నరకం చూపించారు…పంజాబ్ ఓనర్లు దుర్మార్గులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live