Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇరుముడి' డైరెక్టర్ తో బాలయ్య సినిమా..? ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం..

'ఇరుముడి' డైరెక్టర్ తో బాలయ్య సినిమా..? ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం..

Big TV Live 2 weeks ago

Sivanirvana - Balayya : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ తో రీసెంట్గా ఇరుముడి చిత్రంను తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్మాణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ హీరోతో చేయబోతున్నాడట..

అయితే ఇప్పటికే ఆ డైరెక్టర్ పలు హీరోలతో సినిమాలు చేస్తున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు ఓ వార్త నెట్ ఇంత ప్రచారంలో ఉంది. దీని గురించి ఎక్కడ అధికారికి పక్కన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య శివ నిర్వాణ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అంటూ వార్తలు ఊపందుకు ఉన్నాయి. అంతేకాదు ఓ పవర్ ఫుల్ స్టోరీతో యాక్షన్ తో పాటుగా, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

శివ నిర్వాణ – బాలయ్య మూవీ..?

ఇటీవల ఇరుముడి మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడు అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడని ఓ వార్త ప్రచారంలో ఉంది. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీని సిద్దం చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. బాలయ్య కు తగ్గట్లు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటుగా, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరు హీరోయిన్లతో పవర్ ఫుల్ స్టోరీతో సినిమా చేస్తున్నాడని టాక్ ఫిలిం నగర్లో బలంగా వినిపిస్తుంది. ఈ వార్తల పై డైరెక్టర్ స్పందించలేదు. అటు బాలయ్య కూడా రియాక్ట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా కన్ఫర్మ్ అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలకు చెక్ పడాలి అంటే ఎవరొకరు రియాక్ట్ అయ్యేవరకు చూడాలి..

బాలయ్య సినిమాల విషయానికొస్తే..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం ఈ ఏడాది డాకు మహారాజ్, అలాగే అఖండకు సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ రెండు సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా అఖండ 2 ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం బాలయ్య రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. NBK 111, NBK 112 సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.. యాక్షన్ పిరియాడికల్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాల పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సినిమాలు బాలయ్య సక్సెస్ కేరాఫ్ గా మారతాయేమో చూడాలి.. దీంతో పాటుగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.. ఇకపోతే అటు శివ నిర్వణ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడని టాక్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live