Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!

ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!

Big TV Live 1 week ago

Ironing Trick: రోజూవారీ పనుల్లో సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలా మంది రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో చాలామంది అనుసరిస్తున్న ఒక వినూత్నమైన ట్రిక్..

ఇస్త్రీ బల్ల (ఐరనింగ్ బోర్డ్)పై అల్యూమినియం ఫాయిల్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. ఈ చిన్న చిట్కాతో ఇస్త్రీ చేయడం చాలా ఈజీ అయిపోతోందని గృహిణులు, ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా మనం దుస్తులను ఇస్త్రీ చేస్తున్నప్పుడు.. ఐరన్ బాక్స్ నుండి వచ్చే వేడి బట్టల గుండా వెళ్లి కవర్ ద్వారా కింద ఉన్న బోర్డ్‌కు చేరుకుంటుంది. కానీ ఇస్త్రీ బల్ల కవర్ కింద అల్యూమినియం ఫోయిల్‌ను అమర్చినప్పుడు.. అది ఒక ‘రిఫ్లెక్టర్’ లా పనిచేస్తుంది. అంటే ఐరన్ బాక్స్ నుండి వచ్చే వేడిని ఫాయిల్ తిరిగి దుస్తుల వైపునకు ప్రతిబింబిస్తుంది. దీనివల్ల బట్టల పైభాగంతో పాటు కింది భాగం కూడా ఒకేసారి వేడెక్కి.. ఐరన్ అవుతుందని చిట్కా ఫాలో అవుతున్నవారు చెబుతున్నారు.

ఫాయిల్ వల్ల బెనిఫిట్స్

ఐరన్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ వినియోగించడం వల్ల బట్టలను రెండు వైపులా తిప్పి ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవైపు ఇస్త్రీ చేస్తే.. ఫాయిల్ వల్ల వేడి రిఫ్లెక్ట్ అయ్యి రెండో వైపు కూడా ఐరన్ అయిపోతుంది. దీనివల్ల సమయంతో పాటు, శ్రమ ఆదా కానుంది. అంతేకాదు దుస్తులను రెండోవైపు ఐరన్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల విద్యుత్ ను సైతం ఆదా చేసినవారవుతారు. కాటన్ జీన్స్, ఎక్కువ నలిగిపోయిన బట్టలపై ఉన్న మొండి మడతలు కూడా ఫోయిల్ అందించే డబుల్ హీట్ వల్ల చాలా ఫాస్ట్ తొలగిపోనున్నాయి.

ఈ చిట్కా ఎలా పాటించాలి?

ఈ చిన్న చిట్కాను పాటించడం ఎంతో ఈజీ. ముందుగా ఐరనింగ్ బోర్డ్ ఉపరితలంపై మెరిసే వైపు పైకి ఉండేలా అల్యూమినియం ఫాయిల్‌ను పరవండి. మడతలు లేకుండా సమానంగా సర్దిన తర్వాత.. దానిపై మళ్లీ ఐరనింగ్ బోర్డ్ కవర్‌ను తొడిగేయండి. ఆపై ఇస్త్రీ చేయడం ప్రారంభిస్తే.. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో దుస్తులను పర్ఫెక్ట్ గా ఐరన్ చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live