Energy boosting foods for weakness: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనితో రోజంతా బిజీగా గడుపుతుంటాం. అయితే.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది మధ్యాహ్నానికే తీవ్రమైన నీరసానికి, అలసటకు గురవుతుంటారు.
టీ, కాఫీలు తాగడం వల్ల తాత్కాలికంగా శక్తి వచ్చినట్లు అనిపించినా.. అది లాంగ్ రన్‌లో ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి సహజసిద్ధంగా, దీర్ఘకాలికంగా బలాన్ని, స్టామినాను అందించేవి కేవలం ‘సూపర్‌ఫుడ్స్’మాత్రమే. మీ డైలీ జీవితంలో అలసటను తరిమికొట్టి, అపారమైన శక్తిని ఇచ్చే 5 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శరీర బలాన్ని, శక్తిని పెంచే 5 అద్భుతమైన సూపర్‌ఫుడ్స్:
మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కండరాలకు బలాన్ని ఇచ్చే ఫుడ్ లిస్ట్..
1. నానబెట్టిన బాదంపప్పు , జీడిపప్పు :
డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులలో శరీరానికి మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజాన్ని పెంచి నిరంతరాయంగా శక్తిని అందిస్తాయి.
ఎలా తీసుకోవాలి: ప్రతిరోజూ ఉదయం పరగడుపున రాత్రి నానబెట్టిన 4-5 బాదం పప్పులను తొక్క తీసి తినాలి. ఇది మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
2. అరటిపండ్లు:
అరటిపండును ప్రపంచంలోనే అత్యంత చౌకైన , పవర్‌ఫుల్ ఎనర్జీ బూస్టర్‌గా పిలుస్తారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6 శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే అథ్లెట్లు, జిమ్‌కి వెళ్లేవారు వర్కౌట్‌కు ముందు దీనిని తింటారు.
ఎలా తీసుకోవాలి: రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గి, స్టామినా అద్భుతంగా పెరుగుతుంది.
3. రాగులు, ఓట్స్ :
రాగులు, ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా.. రోజంతా స్థిరమైన శక్తి అందుతుంది.
ఎలా తీసుకోవాలి: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావ లేదా ఓట్స్ ఉప్మా రూపంలో తీసుకోవడం వల్ల రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా నీరసం రాదు.
4. గుడ్లు :
కండరాల బలానికి ,శరీరక దారుఢ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, అమినో యాసిడ్స్, విటమిన్ డి ఉంటాయి. ఇవి అలసిపోయిన కండరాలను పునరుజ్జీవింపజేస్తాయి.
ఎలా తీసుకోవాలి: రోజూ ఉదయం ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి.
5. ఆకుకూరలు :
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తం తక్కువై నిరంతరం అలసటగా అనిపిస్తుంది. పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తాయి.
ఎలా తీసుకోవాలి: వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు ఆకుకూరలను పప్పు రూపంలోనో లేదా కూర రూపంలోనో డైట్‌లో చేర్చుకోవాలి.
అర్ధరాత్రి కడుపునొప్పి మిమ్మల్ని వేధిస్తోందా? వీటితో చెక్ పెట్టండి!
శక్తి వృథా కాకుండా ఉండాలంటే ?
కేవలం మంచి ఆహారం తినడమే కాకుండా.. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉండటానికి కింది అలవాట్లు కూడా ముఖ్యం.
హైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గితే.. మొదట వచ్చేది నీరసమే. కాబట్టి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి.
జంక్ ఫుడ్‌కు నో చెప్పండి: ప్యాక్ చేసిన ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మైదా పిండితో చేసిన పదార్థాలు తిన్నప్పుడు వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా, కాసేపటికే ఎనర్జీ లెవెల్స్ ఘోరంగా పడిపోతాయి.
సహజమైన పద్ధతిలో స్టామినా , బలాన్ని పెంచుకోవడానికి ఎలాంటి కెమికల్ సప్లిమెంట్ల అవసరం లేదు. మన వంటింట్లో దొరికే నానబెట్టిన బాదం, అరటిపండ్లు, రాగి జావ వంటి పోషకాలు ఉన్న సూపర్‌ఫుడ్స్ మీ లైఫ్ స్టైల్ మార్చేయగలవు.తాజా హెల్త్ గైడ్‌లైన్స్ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, సహజ ఆహారం తీసుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఏకైక మార్గం. ఈ ఐదు సూపర్‌ఫుడ్స్‌ను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. అలసటను తరిమికొట్టి నిత్య యవ్వనంగా, ఉత్సాహంగా ఉండండి.

