Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని జగదీష్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జగదీష్ రెడ్డి గుంట నక్క కళ్లతో ధాన్యం కొనుగోళ్లు కనిపించడం లేదని ఎంపీ విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో 2021-22 లో 6,609 కొనుగోలు కేంద్రాలు పెట్టగా, 2022-23 లో 7037 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో..
117.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు బీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో 2023-24 లో 7,178 కొనుగోలు కేంద్రాలు,2024-25 లో కాంగ్రెస్ ప్రభుత్వం 8,378 ద్వారా కొనుగోలు చేసిందన్నారు. 2025-26 లో 8,575 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు. ఎవరి హయంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయనేది? జగదీష్ రెడ్డి అవగాహన చేసుకోవాలన్నారు.
Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!
ఫామ్ హౌస్ నాయకుడు..
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 27,747.75 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చిందన్నారు. కళ్లు లేని నేతలు తమ ప్రభుత్వంపై దుష్ఫ్రాచారం చేయడం సరికాదన్నారు. ఫామ్ హౌస్ నాయకుడు చెప్పినట్లు తప్పుడు ప్రచారాలు చేయడం బంద్ పెట్టుకోవాలన్నారు. సూర్యాపేట్ లో కేవలం 2 వేల కోట్లతో గెలిచిన జగదీష్ రెడ్డి, తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

