Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగ్గూభాయ్ డబ్బింగ్ వీడియో వైరల్.. అప్పల సూరిగా థియేటర్లలో పూనకాలే!

జగ్గూభాయ్ డబ్బింగ్ వీడియో వైరల్.. అప్పల సూరిగా థియేటర్లలో పూనకాలే!

Big TV Live 2 months ago

Peddi Update: జూన్ 4…పెద్ది రిలీజ్ కి పట్టుమని పదిరోజులు కూడా లేకపోవడంతో ఒక పక్క సినిమా ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తూనే మరో పక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వేగం పెచింది మూవీ టీమ్.

ఈక్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా క్రేజీ అప్ డేట్ వదిలారు మేకర్స్.

'అప్పలసూరి' పాత్రలో నటిస్తున్న జగ్గుబాయ్

ఈ చిత్రంలో టాలెంటెడ్ సీనియర్ నటుడు జగపతిబాబు అత్యంత కీలకమైన 'అప్పలసూరి' పాత్రలో నటిస్తుండగా, కథను ఊహించని మలుపు తిప్పే ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇదని ఇప్పటికే హింట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా అప్పలసూరి పాత్రకు సంబంధించి జగ్గూభాయ్ డబ్బింగ్ చెబుతున్న ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్‌కు ఆయన లీనమైపోయి డైలాగులు చెబుతున్న తీరు, ఆయన వాయిస్ బేస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ డబ్బింగ్ లోని ఇంటెన్స్ చూస్తుంటే వెండితెరపై మరోసారి ఆయన నటనతో మాయ చేయడం ఖాయమనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు, హీరోగా మార్కెట్ తగ్గుతున్న సమయంలో తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఆయన కెరీర్‌నే మార్చేసింది. 2014లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' సినిమాతో జగపతిబాబు విలన్‌గా సరికొత్త అవతారమెత్తారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన జితేంద్ర పాత్ర టాలీవుడ్‌లో స్టైలిష్ విలనిజానికి ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

also read :స్టార్ హీరోలకే దిక్కులేదు… కిరణ్ అబ్బవరం వంద కోట్లు కొడతాడా?

స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ రోల్స్

గతంలో రామ్ చరణ్ సరసన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' (2018) చిత్రంలో క్రూరమైన ప్రెసిడెంట్ ఫణిభూషణ్ రావు పాత్రలో జగపతిబాబు ఎలా అదరగొట్టాడో చెప్పక్కర్లేదు .అలా కేవలం నెగెటివ్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో ఆయన పోషిస్తున్న అప్పలసూరి పాత్ర గతంలో రంగస్థలంలో చేసిన ప్రెసిడెంటు పాత్రను మించిపోయేలా, మరింత ఇంటెన్సిటీ తో కూడి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్

ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో , స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెల్సిందే.మరి 'పెద్ది' చిత్రంలో అప్పలసూరిగా జగపతిబాబు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో, రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో కాలమే డిసైడ్ చేయాలి.

also read :ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రంభ ఇంట తీవ్ర విషాదం.. నా ప్రపంచం శూన్యమైందంటూ ఎమోషనల్ పోస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live