Imran Khan's sons Interview - boycott Lord's Test: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా.. రెండవ టెస్ట్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టెస్టు ప్రారంభానికి ముందు ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ (Michael Atherton)
టెలికాస్ట్ చేశారు. దీనిపై వివాదం రాజు కోగా… స్కై స్పోర్ట్స్ ఛానల్ కు ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఫిర్యాదు కూడా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ వీడియోను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రెండో టెస్ట్ బాయ్ కాట్ ( boycott Lord’s Test) చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
రెండో టెస్ట్ కంటే ముందు రచ్చ లేపిన ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs England) మధ్య లార్డ్స్ వేదికగా ( Lord’s Test) జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ (Michael Atherton) పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, కాసింఖాన్ లను ఆయన ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూను లంచ్ బ్రేక్ సమయంలో ప్రసారం చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ 18 నిమిషాల పాటు ఉంది.
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ రద్దుకు నఖ్వీ కుట్రలు ?
ఈ 18 నిమిషాలలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సర్కార్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు ఆయన కుమారులు. మొహ్సిన్ నఖ్వీని కూడా టార్గెట్ చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న నఖ్వీ వెంటనే ఆ ఇంటర్వ్యూలు ఆపే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో అంతలోనే ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లను రెండో టెస్టు ఆడకుండా ఆపేందుకు నఖ్వీ ప్రయత్నం కూడా చేశారు.
డ్రెస్సింగ్ రూంలోనే ప్లేయర్లను పెట్టి, బాయ్ కాట్ చేయాలనే ప్లాన్ చేశారు. అర్ధాంతరంగా పాకిస్తాన్ వెళ్లిపోయేందుకు కూడా కుట్రకు తెర లేపింది. అయితే అంతలోనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెంటనే రియాక్ట్ అయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కూడా చేసింది. మైక్ ఆథర్టన్ (Michael Atherton) పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. అటు ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూలు పాకిస్తాన్ అధికారిక ఛానల్ పీటీవీలో ప్రసారం చేయకుండా నిలిపివేశారు.

