Dailyhunt
జస్ట్ రూ.250కే ఏసీ లాంటి చల్లదనం.. ఈ పిచ్చి ఎండలకు ఇదే కరెక్ట్ సొల్యూషన్!

జస్ట్ రూ.250కే ఏసీ లాంటి చల్లదనం.. ఈ పిచ్చి ఎండలకు ఇదే కరెక్ట్ సొల్యూషన్!

Big TV Live 1 week ago

Cool Roof Paint: రోజు రోజుకీ ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. బయటకు వెళ్తే భానుడు మాడ్చేస్తున్నాడు, పోనీ ఇంట్లో ఉందామంటే ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నాం.

ముఖ్యంగా పైన మేడ ఉన్న వాళ్లకైతే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యాహ్నం అయితే చాలు స్లాబ్ వేడెక్కిపోయి, ఫ్యాన్ వేసినా నిప్పులు కురిపించినట్లు వేడిగాలి వస్తుంది. ఇప్పుడున్న సీజన్‌లో ఏసీ కొనడం అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ కొన్నా కరెంటు బిల్లు చూస్తే గుండె గుభేల్ మంటుంది. మరి దీనికి పరిష్కారమే లేదా? అంటే.. ఉంది. తక్కువ ఖర్చులో మన ఇంటిని చల్లగా ఉంచుకునే సూపర్ ఐడియానే ఈ కూల్ రూఫ్ టెక్నాలజీ.

ఎండ వేడికి ఇలా చెక్ పెట్టొచ్చు..

ఇల్లు ఎందుకు అంత వేడిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా ఎండ స్లాబ్‌పై పడటం వల్ల ఆ కాంక్రీట్ వేడిని పీల్చుకుని రాత్రంతా లోపలికి వదులుతుంది. అందుకే రాత్రిపూట సెగ కొడుతూనే ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే స్లాబ్‌పై సూర్యకిరణాలు పడకుండా అడ్డుకోవాలి. అదేనండి.. మేడ పైన తెల్లటి కూలింగ్ పెయింట్ లేదా సున్నం వేయడం వల్ల సూర్యరశ్మి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది. దీనివల్ల గదిలో 5 నుంచి 10 డిగ్రీల వరకు వేడి తగ్గుతుంది.

తక్కువలో సూర్య కూల్ రూఫ్ సున్నం..

మరీ ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకుంటే.. మార్కెట్లో 'సూర్య కూల్ రూఫ్' లాంటి సున్నం ప్యాకెట్లు దొరుకుతాయి. వీటి ధర కేవలం రూ.250 మాత్రమే. ఈ ప్యాకెట్‌లో సున్నంతో పాటు పటిక కూడా వస్తుంది. రెండింటినీ కలిపి మేడపై వేస్తే చాలు.. ఇల్లు ఇట్టే చల్లబడుతుంది. అయితే దీనిలో చిన్న ఇబ్బంది ఏంటంటే.. ఇది కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఉంటుంది. వర్షం పడిందంటే సున్నం కొట్టుకుపోతుంది. కాబట్టి.. ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చే ముందు దీనిని వేసుకోవాల్సి ఉంటుంది.

స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లు.. ఆ క్రేజీ ఫీచర్లకు టెక్ ప్రియులంతా ఫిదా!

ఏళ్ల తరబడి పెయింట్ ఉండాలంటే?

ఒక్కసారి వేస్తే కొన్ని ఏళ్లపాటు ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు బ్రాండెడ్ పెయింట్స్‌ను ఎంచుకోవచ్చు. లూమినెక్స్, ఎక్సెల్ కూల్ కోట్ లేదంటే ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీలు మంచి క్వాలిటీ పెయింట్లను అందిస్తున్నాయి. ఇవి సుమారు రూ.5,000 నుంచి రూ.6,000 మధ్యలో ఉంటాయి. వీటి వల్ల లాభం ఏమిటంటే.. ఇవి 5 నుంచి 12 ఏళ్ల వరకు గ్యారంటీ ఇస్తాయి. ఎండను తగ్గించడమే కాదు.. స్లాబ్ లీకేజీలు ఉన్నా సరే ఇవి అడ్డుకుంటాయి.

పెయింట్ వేసేటప్పుడు పాటించాల్సినవి..

ఎంత మంచి పెయింట్ కొన్నా.. వేసే పద్ధతి సరిగ్గా లేకపోతే ఫలితం ఉండదు. మొదట మేడను నీళ్లతో బాగా కడిగి, దుమ్ము ఏమీ లేకుండా శుభ్రం చేయాలి. గరుకుగా ఉండే బ్రష్‌తో రుద్దితే నాచు లాంటివి పోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మండుటెండలో పెయింట్ వేయకూడదు. ఉదయం పూట గానీ లేదా సాయంత్రం చల్లబడ్డాక గానీ రెండు సార్లు (కోటింగ్స్) వేస్తేనే ఆ పెయింట్ ఎక్కువ కాలం నిలుస్తుంది.

SRI వాల్యూ చెక్ చేసుకోండి..

ఏదైనా పెయింట్ కొనేటప్పుడు ఆ డబ్బా పైన SRI (సోలార్ రిఫ్లెక్టెన్స్ ఇండెక్స్) అని రాసి ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే మీ మేడ అంత చల్లగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది సూర్యకిరణాలను ఎంత వేగంగా వెనక్కి పంపుతుంది అనే దానికి ఒక కొలత లాంటిది. కాబట్టి.. షాపులో అడిగేటప్పుడు ఎక్కువ SRI ఉన్న పెయింట్ ఇవ్వమని అడగండి.

మరో సూపర్ చిట్కా..

మేడ పైన పెయింట్ వేయడంతో పాటు.. కిటికీలకు వట్టివేళ్ల చాపలు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. వాటిపై కాస్త నీళ్లు చల్లితే, బయటి నుంచి వచ్చే వేడి గాలి కాస్త చల్లని గాలిలా మారి లోపలికి వస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న గాలి చల్లబడి, లోపల మంచి సువాసన కూడా వస్తుంది. వేలల్లో ఖర్చు పెట్టకుండానే ఈ చిన్న చిన్న పద్ధతులతోనే ఇంటిని చల్లగా, ప్రశాంతంగా మార్చుకోవచ్చు.

వావ్.. లాంచ్ అయిన కొద్దిరోజులకే Samsung Galaxy A37పై ఊహించని డిస్కౌంట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live