Jetlee OTT: టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో, వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు రితేశ్ రానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జెట్లీ' (Jetlee).
థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ క్రేజీ మూవీ, ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) సొంతం చేసుకుంది. మే 25 నుంచి ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
Read also-'కరుప్పు' డబ్బింగ్ నాకు 'లియో' వివాదాన్ని గుర్తుచేసింది.. గాయని చిన్మయి ఎమోషనల్..
కథా నేపథ్యం ఇదే..
ప్రజాపతి (అజయ్) అనే ఒక బిజినెస్ మ్యాన్ తన బ్యాంక్‌లోని దాదాపు 15 వేల కోట్ల రూపాయలను వేరే చోట ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. దీంతో ప్రజలంతా డబ్బుల కోసం ధర్నాలు మొదలుపెట్టడంతో, అతను దుబాయ్ పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. అయితే, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మిగతా వారు ప్రజాపతిని చంపాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇండియన్ ఏజెంట్స్ అతన్ని పట్టుకుని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, విమానంలో ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు ప్రజాపతి. అసలు విమానంలో ఏం జరిగింది? అందులోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ వేదవ్యాస్ (సత్య) పాత్ర ఏంటి? మరోపక్క సినీ సుడోకు ఆడే వెన్నెల కిశోర్ కథ ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దాదాపు కథంతా ఒక విమానంలోనే నడుస్తుంది.
Read also-ట్రైలర్ ముగిసింది.. అసలు సినిమా ముందుంది.. మోడీ 'పొదుపు' హెచ్చరిక వెనుక అసలు కథ ఇదేనా?
మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది. థియేటర్లలో మిస్ అయిన కామెడీ లవర్స్, ఓటీటీ ప్రియులు మే 25 నుండి జియో హాట్‌స్టార్‌లో ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్‌లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

