Dailyhunt
జియో ఆర్థిక లెక్కలు విడుదల.. కస్టమర్ల సంఖ్య, డేటా వినియోగం, సగటు ఆదాయం.. చూస్తే మతిపోవాల్సిందే!

జియో ఆర్థిక లెక్కలు విడుదల.. కస్టమర్ల సంఖ్య, డేటా వినియోగం, సగటు ఆదాయం.. చూస్తే మతిపోవాల్సిందే!

Big TV Live 2 weeks ago

Jio Results: రిలయన్స్ జియో తన 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (జనవరి - ఫిబ్రవరి - మార్చి) ఫలితాలను విడుదల చేసింది. ఈ నివేదికలో సగటున ఒక కస్టమర్ పై వస్తున్న ఆదాయం (ARPU), పెరిగిన డేటా వినియోగం, లేటెస్ట్ వినియోగదారుల సంఖ్య తదితర వివరాలను తెలియజేసింది.

గతేడాదితో పోలిస్తే అన్నింట్లోనూ అధిక వృద్ధి సాధించడం పట్ల.. జియో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఇంతకీ ఈ నివేదికలోని ఆర్థిక గణాంకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఏఆర్పీయూ పెరుగుదల

జియో తొలి త్రైమాసిక గణాంకాల ప్రకారం.. సగటు వినియోగదారు ఆదాయం (ARPU) గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. రూ.206 నుంచి రూ.214 కు చేరింది. 2025 తొలి త్రైమాసిక లెక్కలతో పోలిస్తే ఇది సుమారు 3.8 శాతం వృద్ధికి సమానం.

పెరిగిన డేటా వినియోగం

గతేడాదితో పోలిస్తే ఒక్కో వినియోగదారుడి నెలవారీ డేటా వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఏకంగా 42.3 GBకి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ఒక యూజర్ సగటు డేటా వినియోగం 33.6 GBగా ఉండేదని జియో వర్గాలు తాజా నివేదికలో స్పష్టం చేశాయి. అలాగే డేటా ట్రాఫిక్ గతేడాదితో పోలిస్తే 35 శాతం పెరిగిందని పేర్కొన్నాయి.

జియో కస్టమర్లు ఎంతమందంటే?

తన తొలి త్రైమాసికం ఫలితాల్లో జియో సబ్ స్క్రైబర్ల మెుత్తం సంఖ్యను సైతం వెల్లడించారు. ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య 52.4 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఇందులో 26.8 కోట్ల మంది 5G వినియోగదారులు ఉండటం విశేషం. ఈ త్రైమాసికంలో కొత్తగా 9.1 కోట్ల మంది కొత్తగా చేరినట్లు స్పష్టం చేసింది.

ఇంతకీ జియో ఆదాయం ఎంతంటే?

మరోవైపు మార్చి త్రైమాసికంలో జియో ఫ్లాట్ ఫామ్స్ నికర లాభం 13 శాతం మేర పెరిగినట్లు ఆర్థిక నివేదిక తెలిపింది. తద్వారా ఆదాయం రూ.7,935 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ కంపెనీ ఆదాయం.. రూ.44,928 కోట్లుగా ఉంది.

BSNL FTTH: సరికొత్త పల్లె విఫ్లవం.. ఏకంగా 79 వేల గ్రామాల్లో.. ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!

ఫలితాలపై జియో ఆందోళన!

తొలి త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే వినియోగదారుల డేటా వినియోగం (42GB పైగా) భారీగా పెరిగినప్పటికీ.. సగటు ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగకపోవడంపై జియో ఆందోళన వ్యక్తం చేస్తోంది. 5G నెట్‌వర్క్‌పై అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లు ఇవ్వడం వల్ల డేటా ట్రాఫిక్ పెరిగిందని, కానీ నేరుగా ఆదాయం పెరగలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మున్ముందు డేటా వినియోగానికి తగ్గట్లు ఆదాయాన్ని పెంచుకునేందుకు జియో టారిఫ్ లను పెంచే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Jio Premium 5G: జియో ప్రీమియం 5G సేవలకు సర్వసిద్ధం.. కానీ ఇంకా వెయిటింగ్ దశలోనే.. కారణం ఏంటంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live