Annual Plans: దేశంలోని ప్రముఖ టెలికాం రంగం సంస్థల్లో జియో, ఎయిర్ టెల్ తొలి రెండు స్థానాల్లో ఉంటాయి. ఈ సంస్థలు తమ యూజర్ల కోసం పదుల సంఖ్యలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఈ క్రమంలోని తీసుకొచ్చిన ఓ వార్షిక ప్లాన్ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. మార్కెట్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న జియో, ఎయిర్ టెల్.. రూ.3,999 ఒకే ధరతో ప్లాన్ తీసుకొచ్చాయి. దీంతో సహజంగానే ఈ రెండు ప్లాన్ల మధ్య ఏది బెస్ట్ అన్న చర్చ టెలికాం వర్గాలు, మెుబైల్ యూజర్లలో మెుదలైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
జియో రూ.3,999 ప్లాన్..
జియో ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటాను యూజర్లు పొందొచ్చు. అంతేకాకుండా మీ ఏరియాలో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉండి.. 5G మెుబైల్ వాడుతుంటే అపరిమిత 5G డేటా సైతం లభించనుంది. అదే విధంగా ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా చేసుకోవచ్చు. మరోవైపు అదనపు ప్రయోజనాల కింద ఇందులో ‘ఫ్యాన్‌కోడ్’ (FanCode) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 3,999 ప్లాన్
ఎయిర్ టెల్ ప్లాన్ ను కూడా 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిలోనూ యూజర్ కు రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతీ రోజు 100 SMSలను యూజర్లు పంపుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో అదనపు బెనిఫిట్స్ కింద హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభించనుంది. ఏడాది పాటు సినిమాలు, సిరీస్ లు, లైవ్ మ్యాచ్ లను అందులో వీక్షించవచ్చు. దాంతోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలు సైతం పొందవచ్చు.
వేసవిలో అతిగా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా? వైద్యులు చెప్పింది వింటే బిత్తరపోతారు!
రెండింటిలో ఏది బెస్ట్?
ధర, వ్యాలిడిటీ, రోజువారీ డేటా పరంగా రెండు ప్లాన్లు ఒకేలా ఉన్నప్పటికీ.. అదనపు ప్రయోజనాల్లో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐపీఎల్, ఇతర లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటం ఇష్టమైతే.. ఎయిర్‌టెల్ ప్లాన్ బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే ఇందులో రూ.899 విలువైన హాట్‌స్టార్ ఏడాది సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తోంది. ఒకవేళ మీకు ప్రత్యేకంగా డొమెస్టిక్ మ్యాచ్‌లు, ఇతర అంతర్జాతీయ క్రీడల లైవ్ స్ట్రీమింగ్ (FanCode) కావాలనుకుంటే జియో వైపు వెళ్లవచ్చు. దీనికి తోడు 5G అపరిమిత డేటా సైతం జియో ఆఫర్ చేస్తుండటం మరో అదనపు అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.

