Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Joshua Tromp:  హారిస్ రవూఫ్ ఒక్కడే ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్

Joshua Tromp: హారిస్ రవూఫ్ ఒక్కడే ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్

Big TV Live 3 weeks ago

Usa Cricketer On Haris Rauf: మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంటు (Major League Cricket 2026 Tournament) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), హారిస్ రవూఫ్ (Haris Rauf) ఒకే జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.

వీళ్ళిద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్న నేపథ్యంలో అశ్విన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హారిస్ రవూఫ్ ను మెచ్చుకుంటూ యూఎస్ఏ క్రికెటర్ జాషువా ట్రాంప్ (Joshua Tromp) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే హారిస్ రవూఫ్ (Haris Rauf) అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అంటూ కితాబు ఇచ్చారు. అలాంటి బౌలర్ ను తాను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. టీమిండియా యార్కర్ల కింగ్ బుమ్రా కంటే బెటర్ అని పరోక్షంగా జాషువా ట్రాంప్‌ హింట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే జాషువా ట్రాంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. జాషువా ట్రాంప్ కు ఏం తెలియదని… జోకర్ లాంటి హారిస్ రవూఫ్ ను డేంజర్ ప్లేయర్ అంటూ అనవసరంగా హైప్ ఇస్తున్నాడని సెటైర్లు పేల్చారు.

Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వర్షం పడి బతికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

హారిస్ రవూఫ్ ఒక్కడే ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్

మేజర్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ (Major League Cricket 2026 Tournament) నేపథ్యంలో హారిస్ రవూఫ్ (Haris Rauf)ను యూఎస్ఏ క్రికెటర్ జాషువా ట్రాంప్ ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేసేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ బౌలింగ్ మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ హారిస్ రవూఫ్ అంటూ జాషువా ట్రాంప్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తాను ఎదురుకున్న వారిలో అత్యుత్తమ బౌలర్ హారిస్ రవూఫ్ అంటూ పేర్కొన్నారు. టీమిండియా తరఫున ఆడుతున్న బూమ్రాను తాను ఎదురుకోలేదు కానీ… తన దృష్టిలో మాత్రం పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ బెటర్ అన్నారు. అత్యుత్తమ వేగంతో బంతులు వేయడం… అవసరమైనప్పుడు యార్కర్లు విసరడం అతని స్టాటజీ అంటూ కితాభించారు. ఈ క్రమంలో హారిస్ రవూఫ్ పై జాషువా ట్రాంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

హారిస్ రవూఫ్ ను పక్కకు పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమికి హారిస్ రవూఫ్ కారణమయ్యాడు. అతడి చెత్త బౌలింగ్ కారణంగా పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ క్రమంలో అప్పటి నుంచి అతడు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని పక్కకు పెట్టి.. కొత్త క్రికెటర్లకు అవకాశం ఇస్తుంది. ఇక అవకాశాలు రాకపోవడంతో మేజర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు హారిస్ రవూఫ్.

Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live