Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

Big TV Live 2 hrs ago

Jurala Project: స్వేచ్ఛ బ్యూరోొ: జూరాల ప్రాజెక్టు వద్ద ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నీటి విడుదల కోసం రైతుల ఆందోళనల దృష్ట్యా జూరాల డ్యాంకు పోలీసులు పహార కాస్తున్నారు.

శనివారం నీటి కోసం రైతులు డ్యాం ను ముట్టడించి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేకపోవడంతో అధికారులు జూరాల గేట్లను మూసివేశారు. అదే క్రమంలో జోగులాంబ గద్వాల, వనపర్తి,మహబూబ్ నగర్ జిల్లాలకు జూరాల డ్యాం ద్వారా ప్రవహించే ఎడమ, కుడి కాలువలకు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఇప్పటికే సాగు చేస్తున్న ఆయకట్టు రైతులు తమ పంట పొలాలు ఎండుతున్నాయని, నీటిని విడుదల చేయాలని జూరాల డాం పై ధర్నా చేపట్టారు. గద్వాల ప్రాంత రైతులు ధర్నా చేపట్టగా ఎడమ కాలువ నీటి కోసం రైతులు ఏకంగా సాయంత్రం వేళ ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాల్వ గేట్లను ఓపెన్ చేశారు.

ఇరిగేషన్ అధికారుల అప్రమత్తత

ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం జూరాల డాం కు ఇన్ ఫ్లో లేకపోవడంతో అధికారులు విధి లేక సాగునీటిని సైతం నిలుపుదల చేశారు. దీంతో రైతులు చేస్తున్న ఆందోళన దృష్ట్యా సాగు నీటి కోసం గేట్లను తెరవడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల ప్రాజెక్టు నీటి వనరులను కాపాడే క్రమంలో పోలీస్ బందోబస్తు కోరారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్పెషల్ పార్టీ బృందం కుడి, ఎడమ గేట్ల దగ్గర పహార కాస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాగునీటికి తొలి ప్రాధాన్యం

ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ లో నుంచి జూరాలకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం జూరాల డ్యాం నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి అవసరాల కోసం నీలో ఉంచినట్లు ఎస్. ఈ కేశవరావు తెలిపారు. రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సాగు ఆరంభంలోనే ఆరుతడి పంటలను సాగు చేయాలని, కేవలం తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రైతులకు సూచించామన్నారు.

హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live