Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

Big TV Live 2 weeks ago

Yeleru Reservoir: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ పరిధిలోని భావరం సమీప ఏలేరు రిజర్వాయర్‌లో డిప్లమా చదువుతున్న విద్యార్థి గల్లంతైన ఘటన చోటు చేసుకుంది.

గల్లంతైన యువకుడు తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వడ్డే ప్రశాంత్ కుమార్‌గా అక్కడి స్థానికులు గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్..

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లొకేషన్ ఫేమస్ కావడంతో కాలేజీ సెలవు సందర్భంగా 10 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. నీటిలోకి దిగిన ప్రశాంత్ లోతైన ప్రాంతంలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన విద్యార్థులకు ఈత రాకపోవడంతో రక్షించలేకపోయారని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు కేసు నమోదు చేసుకున్నారు.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

స్థానికులు డిమాండ్..

రిజర్వాయర్ వద్ద నిత్యం భారీగా పర్యాటకులు వస్తున్నప్పటికీ హెచ్చరిక బోర్డులు లేవని స్థానికులు తెలిపారు.ఈ ఘటన జరిగిన నాలుగు గంటలు గడిచినా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికుల ఆరోపణలు చేశారు. ఇప్పటికైన భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని స్థానికుల డిమాండ్ పోలీసులను డిమాండ్ చేశారు.

అచ్చం 'ఈగ' మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live