Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావ్యతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన కాలభైరవ.. జీవితాంతం ఒకే ఇంట్లో అంటూ!

కావ్యతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన కాలభైరవ.. జీవితాంతం ఒకే ఇంట్లో అంటూ!

Big TV Live 2 weeks ago

Kaalabhairava-Kavya Kalyan Ram: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా ప్రముఖ నటుడు కాలభైరవ లవ్ రూమర్స్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి (M.M.Keeravani)కుమారుడిగా ఈయన ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యారు. సింగర్ గా, సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న కాలభైరవ గత కొంతకాలంగా మరొక నటి కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan ram) తో రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కావ్య కళ్యాణ్ రామ్.. కాలభైరవ కళ్యాణం..

కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే కీరవాణి ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఈ వార్తలను ఖండించలేదు అలాగని ఈ వార్తలపై స్పందించలేదు దీంతో ఇది నిజమేనని అందరూ భావించారు. అయితే అందరూ అనుకున్న విధంగానే కావ్య, కాలభైరవ తమ రిలేషన్ ను నిజం చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..

ఈ భావనలకు పేరు పెట్టలేకపోయాను..

నీతో సమయం గడపడం అంటే పర్వతాల దగ్గర కూర్చుని నీటి ప్రవాహాన్ని చూసినట్లు అనిపిస్తుంది. మీతో పని చేయడం అనేది మీరు ముగించకూడదనే విహారయాత్రలా అనిపిస్తుంది. శీతాకాలంలో నాకు ఎంతో ఇష్టమైన కాఫీ తాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ భావనలకు నేను పేరు పెట్టలేకపోయాను. కానీ ఎక్కడో మా ప్రయాణంలో, చివరికి అది ఏమిటో నేను తెలుసుకున్నాను. మొదటిసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఒక కొత్త వ్యక్తిని కలవలేదు. నేను మొదటిసారి ఇంటికి వచ్చాను అప్పటినుంచి ఎప్పుడు విడిచిపెట్టింది లేదు అంటూ తన మనసులో దాగి ఉన్న లోతైన ప్రేమను బయటపెట్టారు. ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవితాంతం ఉండబోతున్నామనే విషయం అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన తన ప్రేమను బయటపెట్టారు.

వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈయన కావ్య కళ్యాణ్ రామ్ తో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం మసూద, బలగం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live