Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం. ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం. ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Big TV Live 1 month ago

Korean Action Thriller: కళ్ళ ముందే భార్య ఇంకొకరితో ఉంటే భరించడం చాలా కష్టం. ఏ భర్త కూడా ఈ దారుణాన్ని భరించలేడు. ఈ పరిస్థితి ఒక పోలీస్ ఆఫీసర్ ను ఎదురైతే, అది కూడా భార్య గ్యాంగ్ స్టర్ తో సరసాలు ఆడుతుంటే… ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆ పోలీస్ ఏం చేశాడో తెలియాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ను చూడాల్సిందే.

దక్షిణ కొరియా యాక్షన్ డ్రామాలో కొత్త ఒరవడిని సృష్టించిన ఆ సిరీస్ పేరు ‘ది వర్స్ట్ ఆఫ్ ఈవిల్’ (The Worst of Evil).

కథలోకి వెళ్తే…

1990ల సియోల్ నగరంలో కథ సాగుతుంది. డ్రగ్స్, గ్యాంగ్‌వార్స్, రాజకీయ కుట్రలతో నిండిన ఆ కాలంలో ఒక అండర్‌ కవర్ మిషన్ ఓ పోలీస్ ఆఫీసర్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జంగ్ గి-చుల్ (వి హా-జూన్) ఒకప్పుడు డీజేగా ఉండి, తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారి ‘గంగ్నమ్ క్రిస్టల్’ అనే కొత్త రకం డ్రగ్‌ ను తయారు చేస్తాడు. అంతేకాదు కొరియా – జపాన్ – చైనా మధ్య భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ ను నడుపుతుంటాడు. అతని సామ్రాజ్యం భయం, అధికారం, డబ్బుతో నిండి ఉంటుంది.

ఇక మన హీరో విషయానికొస్తే… పార్క్ జూన్-మో (జీ చాంగ్-వుక్) ఒక చిన్న స్థాయి పోలీస్ ఆఫీసర్. అతని భార్య అతని కంటే పై స్థాయిలో ఉండే లేడీ పోలీస్ ఆఫీసర్ యూ ఐ-జుంగ్. ఇక తమ కూతురు కంటే తక్కువ స్థాయి ఉద్యోగం చేస్తున్నాడని అత్తామామలు ఎప్పుడూ హీరోని దెప్పిపొడుస్తూ ఉంటారు. డ్రగ్ మాఫియాను నిర్మూలించడానికి కొరియా-జపాన్ పోలీసులు ఉమ్మడి అండర్‌ కవర్ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. జూన్-మోను గి-చుల్ గ్యాంగ్‌లోకి పంపుతారు. అతను చనిపోయిన గ్యాంగ్ లీడర్ తమ్ముడిగా నటిస్తూ గి-చుల్ నమ్మకాన్ని సంపాదిస్తాడు. కానీ కథ ఇక్కడే టర్న్ అవుతుంది. గి-చుల్‌కు ఐ-జుంగ్ చిన్నప్పటి ఫస్ట్ లవ్ గురించి తెలుస్తుంది. అది మరెవరో కాదు హీరో భార్యనే.

హీరో జూన్-మో మిషన్‌ ను కాపాడటానికి అతని భార్య ఐ-జుంగ్ కూడా గి-చుల్‌కు దగ్గరవ్వాల్సి వస్తుంది. ఇదొక లవ్ ట్రయాంగిల్ మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య నమ్మకం, వృత్తి బాధ్యతలు, ప్రతీకారం మధ్య జరిగే భయంకరమైన మానసిక యుద్ధంగా మారుతుంది కథ. గ్యాంగ్‌లో నమ్మకద్రోహాలు, అంతర్గత యుద్ధాలు, పోలీసుల వ్యూహాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తాయి. జూన్-మో తన భార్యను కాపాడుకుంటూ, డ్రగ్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు ? చివరికి ఆ అండర్‌కవర్ మిషన్ అతని వ్యక్తిగత జీవితాన్ని ఎంతవరకు నాశనం చేసింది ? అన్నది ఈ సిరీస్ కథ. మొత్తం 12 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ JioHotstarలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Read Also : కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live