Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

Big TV Live 2 weeks ago

Bus Theft: మహిళలు ఆధార్ కార్డ్ పట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. పుట్టింటికి వెళ్తున్న సంబురం, ఫంక్షన్‌కు వెళ్లే హడావుడి వారి ముఖాల్లోనే వెలుగు పోతోంది.

అలాంటి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు కిలాడీలు. ప్రయాణికుల మాదిరిగానే బస్సు ఎక్కుతున్నారు. వాళ్లు మహిళలే.. వాళ్లకు ఆధార్‌కార్డులున్నాయి. నోటికి ఏ ఊరుపేరు వస్తే ఆ ఊరుపేరు చెప్పి కండెక్టర్ దగ్గర టికెట్ తీసుకుంటారు.

కట్ చేస్తే బ్యాగ్..

బస్సుల్లో ఒంటరిగా ఉన్న మహిళలు కనిపిస్తే చాలు. పక్క సీట్లో మకాం వేస్తారు. బస్సు స్లోగా వెళ్తుందని మాటలు కలుపుతారు. ఎక్కడికి వెళ్తున్నారంటూ పరిచయాలు చేసుకుంటారు. కట్ చేస్తే బ్యాగ్ ఉండదు. వాళ్లు ఉండరు. అనంతపురం జిల్లాలో సేమ్‌ టు సేమ్ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లింగమనహళ్లి గ్రామానికి చెందిన పుష్పలత కణేకల్లు నుంచి రాయదుర్గం వరకు బస్సులో ప్రయాణిస్తుంది. బస్సులో ఓ మహిళ పక్కన కూర్చుంది. కాసేపు కబుర్లు చెప్పింది. ఎప్పుడు బ్యాగులో చేయి పెట్టిందో తెలియదు. ఎక్కడ బస్సు దిగి వెళ్లిపోయిందో తెలియదు. కానీ రాయదుర్గం వెళ్లిన తర్వాత బ్యాగు ఓపెన్ చేసి చెక్ చేస్తే.. 5తులాల గోల్డ్ చైన్ కనిపించలేదు. లభోదిబోమంటూ అప్పుడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసింది.

Also read: సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

దొంగలు ఉన్నారు జాగ్రత్త..

ఇంకేముంది పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీలను వాడబోస్తున్నారు. ఇలా బస్సుల్లో నిత్యం ఏదోఒకటో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. బస్టాండుల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ అనౌన్స్ చేస్తున్నా.. సీసీ కెమెరాలున్నా.. జరగాల్సి చోరీలు జరుగుతూనే ఉన్నాయి.

Also read: విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live