Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కండోమ్ చూసి షాకైన ఆ ప్రియుడు.. ఆపై మత్తు విరిగిపోయింది

కండోమ్ చూసి షాకైన ఆ ప్రియుడు.. ఆపై మత్తు విరిగిపోయింది

Big TV Live 4 days ago

Siddipet: కూల్‌ డ్రింక్స్, మద్యం బాటిళ్లలో రకరకాల పురుగులు, చెత్త కనిపించడం పేరు విన్నాము.. చూస్తున్నాము. కాకపోతే ఓ మద్యం ప్రియుడికి బీరు బాటిల్‌తోపాటు కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో తాగిన మత్తు అంతా వదిలేసింది.

ఎక్కడ.. ఎప్పుడు? ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సిద్ధిపేట్ జిల్లాలో ఓ మద్యం ప్రియుడికి ఊహించని షాక్

సిద్దిపేట జిల్లా భూంపల్లి ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో కింగ్‌ఫిషర్ బీర్లు కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. అసలే ఎండాకాలం.. కనీసం బీరు తాడితే శరీరం కూల్ గా ఉంటుందని, ఆపై నిద్ర పడుతుందని భావించాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లి కొన్ని బీర్లు బాటిళ్లను తీసుకెళ్లాడు. ఒక బాటిల్ తాగిన తర్వాత మరో బాటిల్‌ను చూశాడు. అందులో కండోమ్ ప్యాకెట్ దర్శనమీయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

అంతేకాదు తాగిన మత్తు దెబ్బకు వదిలేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాటిల్‌ను వైన్ షాపు వద్దకు తీసుకెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. ఆ షాపులోని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనయ్యాడు సదరు మద్యం ప్రియుడు.

బీరు బాటిళ్లలో కండోమ్స్.. ఆపై మత్తు విరిగిపోయింది

పరిస్థితి గమనించిన ఆ వ్యక్తి నేరుగా స్థానిక ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు, విచారణ మొదలుపెట్టారు. సీల్డ్ బాటిల్‌లోకి కండోమ్ ప్యాకెట్ ఎలా వచ్చింది? తయారీ సమయంలో జరిగిన సమస్యా? కావాలనే ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా? అనేదానిపై విచారణ చేపట్టారు.

ఈ వ్యవహారానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మద్యం ప్రియులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తయారీ దారులు ఆ సమయంలో మత్తులో ఉన్నారా? అంటూ ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. మరి అధికారుల విచారణలో ఏ తేలుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live