Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కంటైనర్ లో కాళ్ళూ చేతులు కట్టేసిన స్థితిలో దొరికే మహిళ. అంతు చిక్కని వింత మిస్టరీ

కంటైనర్ లో కాళ్ళూ చేతులు కట్టేసిన స్థితిలో దొరికే మహిళ. అంతు చిక్కని వింత మిస్టరీ

Big TV Live 6 days ago

The Marked Woman OTT Release : సస్పెన్స్, మైండ్ గేమ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో సాగే ఒక పక్కా సైకలాజికల్ మిస్టరీ-థ్రిల్లర్ సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఈ కథ గతం మర్చిపోయిన ఒక మహిళ చుట్టూ, ఆమెను చంపాలని చూసే ఒక హంతకుడి చుట్టూ తిరుగుతుంది. యాక్షన్ కంటే కూడా అసలు ఆ మహిళ ఎవరు, ఆమె వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనే విషయాలను ఒక్కొక్కటిగా విప్పుతూ ప్రేక్షకులలో చివరి దాకా ఉత్కంఠను రేకెత్తించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు దీనికి అడల్ట్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు "ది మార్క్డ్ ఉమెన్" (The Marked Woman). ప్రముఖ రచయితలు రోసా మోంటెరో, ఒలివియర్ ట్రక్ 2023లో రాసిన 'లా డెస్కోనోసిడా' అనే సూపర్ హిట్ క్రైమ్ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఆస్కార్ నామినేటెడ్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'K&S ఫిల్మ్స్' నిర్మించగా, లారా సెండిమ్ స్క్రీన్‌ ప్లే అందించారు. స్పెయిన్‌ లోని బార్సిలోనా, అల్జెసిరాస్ వంటి రేవు పట్టణాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాదాపు 1 గంట 35 నిమిషాల నిడివి గల ఈ సినిమాను కంటెంట్ తీవ్రత దృష్ట్యా కేవలం పెద్దలు మాత్రమే చూడదగిన మూవీగా 'ఏ' రేటింగ్ ఇచ్చారు. ఇక నటీనటుల విషయానికి వస్తే… నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ 'ది అసుంటా కేస్' ఫేమ్ కాండేలా పెన్యా ఇందులో డిటెక్టివ్‌గా నటించారు. 'లా మెసియాస్' నటి అనా రుజాస్ జ్ఞాపకశక్తి కోల్పోయిన మహిళగా నటించారు. వీరితో పాటు 'మనీ హైస్ట్' సిరీస్‌లో బోగోటా పాత్రతో మెప్పించిన లూకా పెరోస్, మనోలో సోలో మరికొన్ని కీలక పాత్రలు పోషించారు. ఈ ఒరిజినల్ స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 2026 జూన్ 5 నుండి ప్రపంచవ్యాప్తంగా నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : 2026 హారర్ హిట్ 'ది మమ్మీ' ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

కంటైనర్ లో కథంతా…

ఒక రాత్రి బార్సిలోనా పోర్టులో సెక్యూరిటీ గార్డు కుక్క మొరగడంతో కథ మొదలవుతుంది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక షిప్పింగ్ కంటైనర్ బయట పడుతుంది. పోలీసులు దాన్ని తెరిచి చూడగా, లోపల నోటికి ప్లాస్టర్ వేసి, స్పృహ లేకుండా ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ కనిపిస్తుంది. ఆమె ఒంటిపై కాలిన గాయాలు, తలకు బలమైన దెబ్బ తగిలి ఉంటాయి. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. అయితే ఆమె స్పృహలోకి వచ్చాక తనకు గతం ఏమీ గుర్తుండదు. కనీసం తన పేరు, ఊరు, తను మాట్లాడే భాష కూడా ఆమెకు గుర్తుకు రాదు. కథ ఇలా ఉండగా, మరోవైపు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆమెను చంపడానికి ఒక హంతకుడు ప్రయత్నిస్తాడు. దీంతో ఈ మిస్టరీ కేస్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను డిటెక్టివ్ అన్నా రిపోల్, ఆఫీసర్ క్విక్ జారటేలకు అప్పగిస్తారు. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెను అంత ఘోరంగా కంటైనర్‌ లో బంధించింది ఎవరు ? ఆమెను చంపడానికి చూస్తున్న ఆ రౌడీ వెనుక ఉన్న రహస్యం ఏంటి ? అనే విషయాలను పోలీసులు ఎలా కనిపెట్టారనేదే ఈ సినిమా కథ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live