Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Serial Today Episode August 28th 'కార్తీక దీపం 2' సీరియల్‌: సూరజ్ తన కొడుకన్న నిజం చెప్పిన మాలిని

Karthika Deepam 2 Serial Today Episode August 28th 'కార్తీక దీపం 2' సీరియల్‌: సూరజ్ తన కొడుకన్న నిజం చెప్పిన మాలిని

Big TV Live 1 week ago

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న నిజం చెప్పాక సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. దీపను హగ్ చేసుకుని ఏడుస్తుంది. జ్యోత్స్న మాత్రం పక్కకు వెళ్లి పేపర్స్‌ తీసుకొచ్చి ఈరోజు నుంచి బావతో నేను రాయించుకున్న అగ్రిమెంట్‌ కూడా క్యాన్సిల్‌ అవుతుంది అంటూ పేపర్స్‌ చింపేస్తుంది.

కాంచన, శ్రీధర్‌ సంతోషిస్తారు. జ్యోత్స్న ఎమోషనల్ అవుతూ దీప నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను.. ఇప్పుడు కొంచెం తీర్చుకున్నాను.. ఇప్పుడు నువ్వు మీ అమ్మను అమ్మా అని ధైర్యంగా పిలవొచ్చు పిలువు దీప అనగానే.. దీప ఏడుస్తూ.. అమ్మా అంటూ పిలుస్తుంది.

సుమిత్ర కూడా ఏడుస్తూ.. దీపను హగ్ చేసుకుని ఏడుస్తుంది. అందరూ ఎమోషనల్‌గా చూస్తుంటారు. దీప ఏడుస్తుంటే.. కార్తీక్‌ వచ్చి కన్నీళ్లు తుడుస్తూ.. ఏమైంది దీప ఏంటీ కన్నీళ్లు అని అడగ్గానే.. దీప అటూ ఇటూ చూస్తుంది అంతా మాములుగానే ఉంటుంది. కార్తీక్‌ ఏంటి నువ్వే శివనారాయణ గారి మనవరాలు అని జ్యోత్స్న చెప్పినట్టు కలగన్నావా… అని కార్తీక్‌ అడిగితే.. అవును బావ.. జ్యోత్స్న నిజం చెప్తానంది.. ఊహే ఇంత అందంగా ఉంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుందో అనగానే.. సరే ఇంకా అందంగానే ఉంటుంది. కానీ నువ్వు వెల్లి మాలిని పక్కన కూర్చో అని చెప్తాడు కార్తీక్‌. ఎందుకని దీప అడిగితే.. ఏం చెప్తాం.. ఈ పెళ్లి పూర్తి అయ్యేలోపు మన జాగ్రత్తలో మనం ఉండాలి వెళ్లు అంటూ పంపిస్తాడు. అంతా గమనిస్తున్న శ్రీధర్‌ మెల్లగా కార్తీక్‌ దగ్గరకు వెళ్లి ఏంటి దీపకు ఏం చెప్తున్నావు.. అని అడగ్గానే. నువ్వేంటి పెళ్లికి వచ్చావా..? లేకపోతే మమ్మల్ని గమనించడానికి వచ్చావా..? అని అడుగుతాడు కార్తీక్‌.. శ్రీధర్‌ మాత్రం వీడు ఏదో గట్టిగానే ప్లాన్‌ చేశాడు. ఆ ఊహించని షాక్‌ తట్టుకోవడానికి రెడీగా ఉండాలి అనుకుంటాడు.

కార్తీక్‌ వెళ్లి మాలిని పక్కనే కూర్చుంటాడు. మాలిని ఏంట్రా మీ తాత భయపడ్డాడా..? ఒకవైపు నువ్వు.. ఇంకోవైపు దీప కూర్చున్నారు.. అని అడగ్గానే.. భయపడటానికి నువ్వేమైనా రాక్షసివా అత్తా మనిషివే కదా.. అంటుంది. కార్తీక్‌ కూడా కాసేపట్లో పెళ్లి అయిపోతుంది. అందరం కలసి బంతి భోజనం చేద్దాం అంటాడు. బాగానే సంబరపడుతున్నార్రా..? అనగానే.. పెళ్లంటే సంబం లేకుండా ఎలా ఉంటుంది పిన్ని ఒకసారి పెళ్లికూతురు ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో.. మా జ్యోత్స్న ఇంతలా సిగ్గుపడటం మొదటిసారి చూస్తున్నాం అనగానే.. అయితే ఆ సిగ్గు పడే ముఖాన్ని గుర్తు పెట్టుకో అంటే ఆ పని ఫోటో గ్రాఫర్‌ చూస్తాడులే పిన్ని అంటాడు కార్తీక్‌. అయితే ఎవ్వరూ ఆపినా ఈ పెళ్లి ఆగదు అంటావా..? అని మాలిని అడిగితే తథాస్తు దేవతలు వచ్చినా పెళ్లి ఆగదు అంటూ కార్తీక్‌ చెప్తాడు. అయితే పెళ్లి ఆగదు అంటావా..? అని మాలిని అంటే కార్తీక్‌, దీప ఇద్దరూ మాలినిని తిడతారు.

అప్పుడే సూరజ్‌ తాళి కట్టబోతూ ఆగిపోతాడు.. మాలిని సూరజ్‌ను చూస్తూ ఉంటుంది. సూరజ్‌ తాళి కట్టకుండా ఆగిపోతాడు. పంతులు తాళి కట్టమని చెప్తుంటే.. వినకుండా మాలినిని చూస్తుంటాడు. శివనారాయణ కూడా సూరజ్‌ పంతులు గారు నీకే చెప్తుంది తాళి కట్టు అని చెప్తాడు. కార్తీక్‌ అనుమానంగా మాలిని చూస్తూ.. ఇక్కడేం జరుగుతుంది అంటాడు. జ్యోత్స్న తాళి కట్టు సూరజ్‌ ముహూర్తం అయిపోతుంది అంటుంది. సూరజ్‌ తాళి కట్టబోతూ.. తాళిని కింద పడేస్తాడు. అందరూ షాక్‌ అవుతారు. మాలిని మెల్లగా పెళ్లి ఆగదా కార్తీక్‌ అంటే ఏం చేశావు పిన్ని అంటూ కార్తీక్‌ అడగ్గానే.. సూరజ్‌ నా కొడుకు అయినా పెళ్లి ఆగదా..? కార్తీక్‌ అంటుంది మాలిని.. కార్తీక్‌ షాకింగ్‌గా సూరజ్‌ నీ కొడుకా..? అని అడిగితే.. మాలిని సూరజ్‌ దగ్గరకు వెళ్లి అవును సూరజ్‌ ఈ మాలిని కొడుకు. సూరజ్‌ అనాథ కాదు ఈ మాలిని కృష్ణమూర్తిల ఒక్కగానొక్క కొడుకు అని చెప్తుంది. మాలిని మాటలకు అందరూ మరింత షాక్‌ అవుతారు.

ఇదంతా నేను ఆడించిన నాటకం సూరజ్‌ను పెంచిన వ్యక్తిని అని చెప్పుకున్న వ్యక్తి కూడా నా మనిషే.. ఈ మాలిని పగకు నిలువెత్తు రూపం ఈ సూరజ్‌. నువ్వు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో నువ్వు చూసింది సూరజ్‌ నే నిజాన్ని కంటితో చూశావు.. మనసులో నమ్మలేకపోయావు.. ఇక ఈ పెళ్లి జరగదు అందరూ వెల్లిపోండి అని చెప్పగానే.. అందరూ వెళ్లిపోతారు. అందరూ వెళ్లాక ఇక ఇప్పుడు చెప్పండి నా కొడుక్కి మీ జ్యోత్స్నను ఇచ్చి పెళ్లి చేస్తారా…? అని అడుగుతుంది మాలిని. కార్తీక్‌ కోపంగా ఎంత నమ్మకద్రోహం చేశావు పిన్ని అంటే.. ఇక్కడ పెళ్లి ఆగిపోవడం నమ్మకద్రోహం అయితే నా భర్తను చంపడం ఏమంటారు అంటూ నిలదీస్తుంది. మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live