Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Serial Today Episode May 29th 'కార్తీక దీపం 2' సీరియల్‌: నష్ట పరిహారం కోసం శివనారాయణ దగ్గరకు వెళ్లిన సూరజ్

Karthika Deepam 2 Serial Today Episode May 29th 'కార్తీక దీపం 2' సీరియల్‌: నష్ట పరిహారం కోసం శివనారాయణ దగ్గరకు వెళ్లిన సూరజ్

Big TV Live 1 week ago

Karthika Deepam 2 serial today Episode: శివనారాయణ ఇంటికి వచ్చిన సూరజ్‌ తనను జ్యోత్స్న అన్ని రకాలుగా నష్టం చేసిందని చెప్తుంటే.. జ్యోత్స్న తానే చేశానని నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని మాట్లాడుతున్నావని అడుగుతుంది.

దీంతో యూట్యూబ్‌ వీడియో సాక్ష్యంగా చూపిస్తాడు. తనకు న్యాయం కావాలని సరైనా సమాధానం కావాలి. జరిగిన దానికి నష్టపరిహారం కావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తానన్నారు కదా..? మీ మాట నిలబెట్టుకోండి.. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అంటూ సూరజ్‌ అడుగుతుంటే.. కార్తీక్‌ బ్రదర్‌ అన్ని ఇప్పుడే అంటే ఎలా అనగానే.. సూరజ్‌ సరే మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను.. మీరే ఆలోచించుకుని ఫోన్‌ చేయండి అంటూ సూరజ్‌ వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ ఒక వీధిగుండా.. ఇలాంటి వాళ్లను నమ్మితే రోజుకొకడు వచ్చి ఇలాగే చేస్తాడు. అసలు వాడు ఒక వేస్ట్‌ ఫెలో తాత అంటూ జ్యోత్స్న రూంలోకి వెళ్లిపోతుంది.

కట్‌ చేస్తే రూంలో ఆలోచిస్తూ కూర్చున్న జ్యోత్స్న దగ్గరకు పారిజాతం వెళ్లి తిడుతుంది. నువ్విక తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపో అంటుంది. దీంతో జ్యోత్స్న వాడొక వెస్ట్‌ఫెలో గ్రాణి అంటూ చెప్పగానే.. పారిజాతం కోపంగా తిడుతూనే ఉంటుంది. జ్యోత్స్న మాత్రం ఆ సూరజ్‌ గాడు ఒక వేస్ట్‌ ఫెలో వాడి మాటలు నమ్మకు గ్రాణి.. వాడొక పెద్ద ఇగోయిస్ట్‌.. వాడిది ప్లాట్‌ఫాం బతుకే అయినా మాటలు మాత్రం మీర్జాపూర్‌ జమీందార్‌లా ఉంటాయి. వాడికి మనలాంటి డబ్బున్న వాళ్లంటే వాడికి ఈర్ష్య. ఆ కడుపు మంటతోనే వాడు నాతో గొడవ పెట్టుకున్నాడు అంటూ చెప్పగానే.. పారిజాతం కోపంగా మనవి అద్దం లాంటి బతుకులు అంటూ చెప్పబోతుంటే.. వెంటనే శివనారాయణ జ్యోత్స్నను పిలుస్తాడు. జ్యోత్స్న కిందకు వెళ్తుంది. ఏంటి తాత పిలిచావు అంటూ అడగ్గానే.. ఏం జరిగిందో మాకు తెలిసింది.. కానీ ఎందుకు జరిగిందో మాకు తెలియదు అంటాడు శివనారాయణ. దశరథ కూడా అసలు నీకు ఆ పుట్‌పాత్‌ వెండర్‌తో గొడవేంటి..? అని అడుగుతాడు. దీంతో జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు.

ఇద్దరి మధ్య జరిగిన విషయం ఏంటో చెప్పమని శివనారాయణ అడగ్గానే.. కార్తీక్‌ జరిగిందంతా చెప్పేస్తాడు. షాపులో సూరజ్‌ తీసుకున్న బొమ్మ కోసం జ్యోత్స్న చేసిన గొడవ నుంచి కారులో తీసుకెళ్లి రాంగ్‌ రూట్లో వదిలేసిన విషయం మొత్తం చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. సుమిత్ర కూడా కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. నువ్వు అడిగింది అందరూ ఇచ్చేయాలా..? ఇవ్వకపోతే పగ సాధిస్తావా..? మామయ్య గారు తప్పు దీనిదే అని అర్థం అయింది కాబట్టి వెంటనే సరి చేయండి అని చెప్తుంది. దీంతో శివనారాయణ సూరజ్‌కు ఫోన్‌ చేసి రమ్మనమని కార్తీక్‌కు చెప్తాడు. జ్యోత్స్నను లోపలికి వెల్లమని చెప్తాడు. జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. వెనకాలే వెళ్లిన దీప వెళ్లి జ్యోత్స్నను తిడుతుంది. దీంతో జ్యోత్స్న కోపంగా దీపతో చాలెంజ్‌ చేసి నేను తగ్గాల్సిన అవసరమే లేదు.. ఏం జరుగుతుందో చూస్తాను.. అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో సూరజ్‌ వస్తాడు. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. సూరజ్‌కు నష్టపరిహారం కింద శివనారాయణ ఐదు లక్షలు ఇస్తే సూరజ్‌ అవి సరిపోవని చెప్తాడు.

దీంతో అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న కోపంగా చెప్పాను కదా ఇలాంటి వాళ్లు డబ్బు కోసమే వస్తారని చెప్పాను కదా అంటాడు. ఇంతలో శివనారాయణ మరో ఐదు లక్షలు ఇస్తామని చెప్పగానే.. సూరజ్‌ అది కూడా సరిపోవని చెప్తాడు. దీంతో పారిజాతం, జ్యోత్స్న కోపంగా సూరజ్‌ ను తిడుతుంటారు. ఇంతలో సుమిత్ర నీకు ఎంత కావాలో చెప్పు బాబు అని అగ్గానే.. నాకు జరిగిన నష్టానికి పరిహారం కావాలి.. అనగానే.. ఇదే కదా పరిహారం అంటూ శివనారాయణ అడగ్గానే.. సూరజ్‌ తనకు డబ్బులు వద్దని తాను గౌరవం కోల్పోయిన చోట గౌరవం, నమ్మకం ఇవ్వాలని చెప్తాడు. అదెలా ఇవ్వాలని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న మాత్రం అతను ఏం అడుగుతున్నాడో నాకు అర్థం అయింది గ్రాని నాచేత సారీ చెప్పించుకోవాలనుకుంటున్నాడు అనగానే.. సూరజ్‌ సారీ సరిపోదు మేడం అంటాడు. సూరజ్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు.

కార్తీక్‌ మాత్రం డబ్బులు వద్దంటావు.. సారీ సరిపోదంటావు.. ఇంకేం కావాలి బ్రదర్‌ నీకు.. నువ్వు అడిగేది చూస్తుంటే ఎలా ఉంది తెలుసా..? సూరజ్‌ విషయంలో నేను తప్పు చేశాను అని మా జ్యోత్స్న ఫ్లెక్సీ నీ షాపు ముందు పెట్టమనేలా ఉన్నావే అనగానే.. పారిజాతం పది లక్షలు డబ్బే వద్దన్నవాడు బోడి ఫ్లెక్సీ అడుగుతాడా..? చచ్చినా అడగడు అనగానే.. సూరజ్‌ మాత్రం కార్తీక్‌ గారు చెప్పింది న్యాయంగానే ఉంది.. అదే చేయించండి అంటాడు.. దీంతో పారిజాతం దీనికి మేము అసలు ఒప్పుకోమని తిడుతుంది. ఇంకా నయం నష్టపరిహారంగా జ్యోత్స్ను జ్యూస్‌లు సర్వ్‌ చేయమని అడగలేదు అనగానే. సూరజ్‌ మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live