Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Serial Today Episode September 3rd 'కార్తీక దీపం 2' సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్

Karthika Deepam 2 Serial Today Episode September 3rd 'కార్తీక దీపం 2' సీరియల్‌: పార్కులో జ్యోత్స్నను కలిసిన సూరజ్

Big TV Live 1 week ago

Karthika Deepam 2 serial today Episode: సూరజ్ ఉన్న అవుట్‌ హౌస్‌లో ఉన్న రూంలోకి వెళ్లి బాధపడుతున్న జ్యోత్స్న దగ్గరకు కార్తీక్‌, దీప వెళ్లి ఓదారుస్తారు.

సూరజ్‌ను మర్చిపోమ్మని చెప్తారు. కానీ జ్యోత్స్న ఒప్పుకోదు. సూరజ్‌ మాలిని కొడుకు అయినంత మాత్రాన తన ప్రేమను చంపుకోలేనని చెప్తుంది. ఇంకా సూరజ్‌ను ప్రాణం కంటే ఎక్కువే ప్రేమిస్తున్నాను అంటుంది. అందుకు కార్తీక్‌ సరే కానీ నీది అసలైన ప్రేమ కానీ సూరజ్‌ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేమ పేరుతో నాటకం ఆడాడు. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఇంకా ప్రేమించడం కరెక్ట్‌ కాదు జ్యోత్స్న సూరజ్‌ను వదిలేయ్‌ అంటూ కార్తీక్‌ చెబితే..

వదిలేయడం అంత తేలిక కాదు బావ. సూరజ్‌ను నేను ప్రేమిస్తున్నాను.. ఇప్పుడు నన్ను మోసం చేశాడని నా మనసు మార్చుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే అని చెప్తుంది. ఇంకా కార్తీక్‌, దీపలను కూడా మీరు ఎంతో సూరజ్‌ను నమ్మారు. సొంత తమ్ముడిలా నువ్వు సొంత మరిదిలా నువ్వు చూశారు. సూరజ్‌ గురించి నిజం తెలిశాక మీరు ఎంతలా బాధపడి ఉంటారో నాకు తెలుసు.. పైగా ఇంట్లో అందరూ మిమ్మల్నే దోషులుగా చూస్తున్నారు. మీ ఇద్దరినే నిందిస్తున్నారు.. కానీ నేను మాత్రం మిమ్మల్ని నిందించలేను అంటుంది జ్యోత్స్న.. బాధ్యత తీసుకున్నాక ఆ మాత్రం భరించాలి.. కానీ మనల్ని వద్దనుకున్న వాళ్లను మనం కూడా వదిలేయాలి అని దీప చెబితే.. తాను సూరజ్‌ ప్రేమ వలలో చిక్కుకుపోయాను బయటకు రాలేను అంటుంది. దీప బాధగా ఏంటి బావ జ్యోత్స్న ఇలా మారిపోయింది అంటే కార్తీక్‌ మాత్రం ఇప్పుడు తామేం చేయాలో తనకు క్లారిటీ వచ్చిందంటాడు.

శివనారాయణ, సుమిత్ర, దశరథ కూర్చుని ఉంటే పారిజాతం కాఫీ తీసుకొస్తుంది. అప్పుడే శివనారాయణ ఇంట్లో పనులన్నీ పారిజాతాన్నే చూసుకోమంటాడు. సరే అంటుంది పారిజాతం. శివనారాయణ నవ్వుతూ నీ చేతితో బెండకాయ పులుసు మాత్రం చేయకు తినలేక చస్తాం అంటూ నవ్వుతాడు. శివనారాయణ నవ్వుతుంటే మనసులో ఇంత బాధపెట్టుకుని బయటకు ఎలా నవ్వుతున్నారు మామయ్య అని సుమిత్ర అడిగితే.. మనం బాధలోంచి బయటకు వస్తేనే కదమ్మా జ్యోత్స్నను ఓదార్చగలం తనను రిలీఫ్‌ చేయగలం అంటాడు. అప్పుడే జ్యోత్స్న బయటకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మ అని దశరథ అడిగితే బయటకు వెళ్తున్నాను.. నన్ను నేను వెతుక్కోవడానికి అని చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు దక్షిణమూర్తి తన కూతురు సుమిత్ర, అల్లుడు దశరథ మన ఇంటికి వస్తారన్నావు ఇంకా రాలేదేంటమ్మా అని మాలినిని అడుగుతాడు. తాను శివనారాయణ ఇంటికి వెళ్లడానికి సిద్దమవుతాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటాడు. అందుకు మాలిని ఒప్పుకోదు.. మీరు ఇక్కడే వెయిట్‌ చేయండి.. శివనారాయణ, సుమిత్ర, దశరథ కలిసే వస్తారు అంటూ మిగతా విషయాలు సూరజ్‌ చూసుకుంటాడు అని చెప్పి దక్షిణమూర్తిని ఆపేసిన మాలిని సూరజ్‌ దగ్గరకు వెళ్లి అబద్దాలు చెప్తుంది. నీకు అంతా తెలుసు కదా సూరజ్‌ ఎలా ఉండాలో అంటూ వెళ్లిపోతుంది.

బయటకు వెళ్లిన జ్యోత్స్న ఒక పార్కులో కూర్చుని ఉండగా అక్కడికి సూరజ్‌ వెళ్తాడు. జ్యోత్స్ను చూసి వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే.. జ్యోత్స్న సూరజ్‌ను పిలిచి ఎందుకు వచ్చావో చెప్పకుండా వెళ్లిపోతున్నావేంటి..? అని అడుగుతుంది. అసలు మీ అమ్మ పగకు నా ప్రేమను నట్టేట ముంచేసి వెళ్లిపోతావా..? ఇది న్యాయమేనా అంటూ సూరజ్‌ను ప్రశ్నిస్తుంది. అందుకు సూరజ్ మీ అమ్మ వల్లే నాకు నా తండ్రి దూరమయ్యాడు.. లేదంటే.. నాకు చిన్నప్పటి నుంచి అందరూ ఉండేవారు.. నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ అనుభవిస్తున్న బాధను ఇప్పుడు నీ ఫ్యామిలీ అనుభవిస్తుంది. నా తల్లి కన్నీరు తుడవాలి అంటే నా తండ్రి చావుకు న్యాయం జరగాలి అదే నాకు కావాల్సింది అంటూ సూరజ్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live