Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

Big TV Live 1 week ago

LPG Cylinder Price: పెరిగిన నిత్యావసర వస్తువులతో సతమతమవుతున్న సామాన్యులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

పెంచిన ధరలు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడడం ఖాయం.

గ్యాస్ కస్టమర్లకు ఊహించని షాక్

సెప్టెంబర్ నెల మొదలుకావడంతో ఎల్పీజీ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధర అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. ఐఓసీఎల్ ప్రకారం..19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగింది. ఈ విషయంలో గృహ వినియోగదారులకు ఊరట ఇచ్చింది.

దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలపై పడనున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ రూ.2,996కు కాగా, ఏపీలో రూ.2932 లకు చేరింది. ఢిల్లీ- రూ.2,747.50 లు కాగా, ముంబై- రూ.2,701కు పెరిగింది. చెన్నైలో ధర రూ.2,916.50కు చేరుకుంది.

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, హోటళ్లకు వెళ్తే చిల్లు ఖాయం

ఆ లెక్కన గ్యాస్ సిలిండర్‌పై రూ.10.50 అదనపు భారం పడినట్టే. ఆగస్టులో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను గణనీయంగా తగ్గించిన విషయం తెల్సిందే. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ప్రారంభంలో ఎల్‌పిజి ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరల మార్పుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి.

14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెంచలేదు. ఫలితంగా సామాన్యుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. దీనికితోడు 5 కేజీ, 10 కేజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచలేదు ఆయిల్ కంపెనీలు. 5 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం మార్కెట్లో రూ.349.50 లకు లభిస్తుంది. ఎక్స్‌ట్రా లైట్ సిలిండర్ ధర రూ.339 వద్ద కొనసాగుతోంది. 5 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.762 నుండి రూ.764కు పెరిగింది.

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live