Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

Big TV Live 1 week ago

Kavitha Prashanth: ఒకరు అంటున్నారు.. తండ్రీకూతుళ్ల మధ్య దూరానికి ప్రశాంత్‌రెడ్డే కారణమని. మరొకరు చెబుతున్నారు.. తాను కలపడానికే ప్రయత్నించాను కానీ విడదీయలేదని.

ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు చర్చ. తనను కేసీఆర్‌కు దూరం చేయడంలో ప్రశాంత్‌రెడ్డి పాత్ర ఉందన్నది కవిత ఆరోపణ. అందుకే హరీశ్‌రావునైనా.. సంతోష్‌రావునైనా క్షమిస్తానేమో కానీ.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కవిత పార్టీ గీత దాటారా..?

దీనికి ప్రశాంత్‌రెడ్డి కూడా ఘాటుగానే బదులిచ్చారు. కవిత పార్టీ నిర్ణయాలను, పార్టీ గీతను దాటి వ్యవహరించడం వల్లే చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తాను ఎప్పుడూ కుటుంబాన్ని, పార్టీని కలిపే ప్రయత్నమే చేశానన్నారు. అంతేకాదు.. కవిత మధ్యలో వచ్చి.. మధ్యలో వెళ్లిపోయారని చెప్పడం ద్వారా తన స్టాండ్ ఏంటో క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఎవరిని దూరం చేశారు..? కవిత పార్టీ గీత దాటారా..? లేక ఆమెను రాజకీయంగా దూరం చేశారా..? నిజంగా కలపడానికి ప్రయత్నం జరిగిందా..? లేక ఇది నిజామాబాద్ లో పట్టు కోసం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమా..? కవిత ఆరోపణలు.. ప్రశాంత్‌రెడ్డి కౌంటర్.. మధ్యలో అసలు నిజం ఎక్కడుంది..?.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live