Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kavitha Press Meet: కేసీఆర్‌ను తండ్రిగా కాదు.. రాజకీయ నేతగా విమర్శించా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!

Kavitha Press Meet: కేసీఆర్‌ను తండ్రిగా కాదు.. రాజకీయ నేతగా విమర్శించా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!

Big TV Live 2 weeks ago

Kavitha Press Meet: పార్టీ పేరు ప్రకటన సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పై చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధినేత్రి కవిత తాజాగా స్పందించారు.

తండ్రిగా కేసీఆర్ ను విమర్శించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పుచేశారు కాబట్టే విమర్శించినట్లు చెప్పారు. వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టే తప్పుబట్టానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఈ విమర్శల పర్వం ఇలాగే కొనసాగుతుందని ఆమె స్ఫష్టం చేశారు.

కేటీఆర్‌పై సెటైర్లు

హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. కేసీఆర్ తో పాటు కేటీఆర్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై మరోమారు విమర్శలను ఎక్కుపెట్టారు. ప్రతి దేశం తిరిగి స్పీచ్ లు ఇచ్చే కేటీఆర్ లాంటి నాయకులు ఉన్నప్పుడు.. గ్రూప్ 2, 10TH క్లాస్ పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ పేరును అనౌన్స్ చేసేముందు చాలా రకాల టాక్టిక్స్ ప్లే చేసినట్లు ఆమె తెలిపారు. అయితే తనను జోక్ అన్నవాళ్లకు కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. బీజేపీ వాళ్లకు తనను తిట్టడం తప్ప వేరే పని లేదని కవిత మండిపడ్డారు.

ఈ 5 అంశాలపై ప్రశ్నిస్తా..

అనేక చిక్కుల్ని దాటుకుంటూ నేడు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చామని కవిత అన్నారు. స్వచ్ఛంద సంస్థ లాగ తెలంగాణ జాగృతి అలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. సర్వోదయ తెలంగాణ తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పాంచజన్యం లాగ మేము 5 అంశాలను తీసుకున్నామని.. పాలక పక్షాన్ని ఈ ఐదు అంశాల మీద ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఒక సాధారణ కుటుంబంలో 60 శాతం వరకు డబ్బు విద్య, వైద్యానికి ఖర్చు అవుతుందని.. తెలంగాణ లో 75 శాతం పిల్లలు ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారని కవిత తెలిపారు. వ్యవసాయానికి 3 వ ప్రాధాన్యత ఇస్తామని.. తమ పార్టీ జెండాలో ఉన్న ఆకుపచ్చ రంగు పంటపొలాలకు ప్రతీకగా పెట్టామని తెలియజేశారు.

ప్రతీ ఇంటికి.. ఒక ఉద్యోగం

తమ ప్రభుత్వం వచ్చాక రైతులు పండించే పంటను డైరెక్ట్ గా ఎగుమతి చేయడంపై దృష్టి పెడతామని కవిత అన్నారు. రైతుల పట్ల సీరియస్ కమిట్మెంట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాల్గవ అంశమైన ఉపాధి అంశం కోసం.. యూత్ కి రూ.2 లక్షల నుండి రూ.20 కోట్ల వరకూ వ్యాపార రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఊరికి ఒక బడి, ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఉండాలనేది తమ ఆకాంక్ష అని కవిత పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయలేదని కవిత విమర్శించారు.

‘నన్ను ట్రోల్ చేశారు’

తాను అమ్మలాగా పరిణితి చెందాలని అంటే ట్రోల్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మతనం లేదని విమర్శించారు. వికలాంగులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇంత పెద్ద సెక్రటేరియట్ లో ఒక్క ర్యాంప్ కూడా లేదని మండిపడ్డారు. 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని కవిత అన్నారు. మైనర్టీలకు రూ. 4 వేల కోట్లు ఇస్తామని చెప్పి.. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వెలుగుమట్ల, కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు పిట్టలు రాలినట్లు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ ఎందుకు వీటిని పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.

ఇల్లు సెగలు కక్కుతోందా? మెయిన్ విలన్స్ కిటికీలే.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు!

‘అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్’

మరోవైపు రేవంత్ సర్కార్ సంకల్పించిన ఫ్యూచర్ సిటీ ఒక ఫ్యూచర్ లెస్ సిటీ అంటూ కవిత ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక మహిళలపై అత్యాచారాలు రాకెట్ లాగా పెరుగుతున్నాయని అన్నారు. ఒక సంవత్సరంలో 2,500 పైగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసలు పోలీసు వ్యవస్థ తెలంగాణ లో ఉందో లేదో తెలియట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలదొస్తున్నారని, లెక్కలేని తనంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: విద్యుత్ సరఫరాలో లోపాలు.. సీఎం రేవంత్ అసహనం.. అధికారులకు వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live