Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KD మూవీ రివ్యూ.. సౌండ్ ఎక్కువ.. సరుకు తక్కువ!

KD మూవీ రివ్యూ.. సౌండ్ ఎక్కువ.. సరుకు తక్కువ!

Big TV Live 1 week ago

KD Review:ధ్రువ సర్జా హీరోగా, ప్రేమ్ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'KD: The Devil'.KVN ప్రొడక్షన్స్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేస్తోంది?

ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి ఇది నిజంగానే పూనకాలు తెప్పిస్తుందా?చూసేద్దాం !

రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ 1970 బెంగళూరు

సినిమా మొదలవ్వడమే ఒక పవర్‌ఫుల్ అట్మాస్ఫియర్‌తో మొదలవుతుంది. 1970ల కాలం నాటి బెంగళూరును కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు ప్రేమ్ వంద శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి . పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన కాళిదాసకు అప్పటికే నగరాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న గ్యాంగ్‌స్టర్లు ఎదురవుతారు. తన అడ్డాను వదిలి వెళ్లిన పులి మళ్ళీ తిరిగి వస్తే ఆ అరణ్యంలో ఎలాంటి అలజడి మొదలవుతుందో, KD ఎంట్రీతో బెంగళూరు వీధులు అలా రక్తం రంగు పులుముకుంటాయి. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి KD చేసిన యుద్ధమే ఈ సినిమా.

ధ్రువ సర్జా.. మాస్ ఊచకోత!

also read :దళపతి విజయ్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి జోస్యం

సినిమాకి అతిపెద్ద బలం ధ్రువ సర్జా మేకోవర్. ‘యాక్షన్ ప్రిన్స్’ అనే బిరుదుకు న్యాయం చేస్తూ, తన బాడీ లాంగ్వేజ్‌తో థియేటర్లో చప్పట్లు కొట్టించాడు. ముఖ్యంగా ఆ గంభీరమైన వాయిస్, కళ్లలో కనిపించే క్రూయాలిటీ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. కేవలం ఫైట్లు మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్లలో కూడా ధ్రువ మంచి నటననే కనబరిచాడు.

సరికొత్తగా సంజయ్ దత్, శిల్పా శెట్టి

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ల రాక పెద్ద ప్లస్ పాయింట్. సంజయ్ దత్ తన విలనిజంతో మరోసారి వెన్నులో వణుకు పుట్టించాడు. ఇక సత్యవతి పాత్రలో శిల్పా శెట్టి గ్రేస్, ఆమె నటన సినిమాకు ఒక క్లాస్ టచ్ ఇచ్చింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకు మంచి వెయిట్ తీసుకొచ్చాయి. విజువల్స్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా, ముఖ్యంగా ఆ పాత కాలం నాటి గల్లీలను చాలా రా (Raw) గా చూపించింది.

రీసౌండ్ ఇచ్చే మ్యూజిక్

అర్జున్ జన్యా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఎలివేషన్ సీన్ కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ థియేటర్లో రీ సౌండ్ చేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ ల్లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మాస్ ఆడియన్స్‌కి మాంచి కిక్ ఇస్తాయి.

also read :ఫిలిం ఛాంబర్ లో హై-వోల్టేజ్ మీటింగ్….పెద్ది కి లైన్ క్లియర్ !

కొంచెం తగ్గింది ఎక్కడంటే?

సినిమాలో మేకింగ్, యాక్షన్ ఎంత టాప్ లెవల్‌లో ఉన్నాయో, కథ మాత్రం అంతే పాతగా అనిపిస్తుంది. మనకు గతంలో చూసిన రౌడీయిజం, రివెంజ్ వంటి అంశాలే మళ్లీ కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించడం, హింస మరీ శృతి మించి ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్ కి దూరం చేసే అంశాలే. ఇక సినిమాలో బ్లడ్ బాత్ టూ మచ్ అవడం వల్ల సెన్సిటివ్ ఆడియన్స్ కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి.

ప్లస్ పాయింట్స్

  • ధ్రువ సర్జా మేకోవర్
  • బాలీవుడ్ స్టార్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

  • రక్తపాతం
  • పాత కథ
  • స్క్రీన్ ప్లే ల్యాగ్

చివరిగా ..

మొత్తానికి “KD: The Devil” అనేది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో మసాలా ఉంది, మ్యాటర్ ఉంది, మాస్ కి కావాల్సిన ఊపు ఉంది. కొత్తదనం తక్కువైనా, ధ్రువ సర్జా ఎనర్జీ కోసం, ఆ మేకింగ్ క్వాలిటీ కోసం ఒకసారి హ్యాపీగా థియేటర్లో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. రొటీన్ కథే అయినా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం బాగుంది. మాస్ సినిమా ప్రేమికులకు ఇది మంచి బిర్యానీనే ..కాని వెజిటేరియన్స్ పరిస్థితి ఎంటన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

KD: The Devil review and rating 2/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live