Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kerala Election Results Live Updates: కేరళ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్ జోరు,  మిగతా నియోజకవర్గాల్లో కూడా

Kerala Election Results Live Updates: కేరళ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్ జోరు, మిగతా నియోజకవర్గాల్లో కూడా

Big TV Live 2 weeks ago

Kerala Election Results Live Updates: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు మొదలైంది.

ఆది నుంచి ఎల్‌డీఎప్-యూడీఎఫ్ మధ్య నువ్వానేనా అన్నరీతిలో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యంలో ఈ రెండు కూటముల మధ్య తేడా క్రమంగా పెరుగుతోంది.

తొలుత కాస్త వెనుకబడినా, క్రమంగా ఆధిపత్యం దక్కించుకుంది యూడీఎఫ్. గతంతో కంపేర్ చేస్తే ఎల్డీఎఫ్ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తోంది. మైనస్ 11 తగ్గగా, యూడీఎఫ్‌కు ప్లస్ 16 పెరిగాయి. దీంతో ట్రెండ్ అంతా యూడీఎఫ్ వైపు మళ్లినట్టు రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎన్డీయే రెండు, ఇతరులకు ఒకటి వచ్చాయి.

రాజధాని తిరువనంతపురంలో 14 సీట్లకు ఏడు సీట్లలో అధికార ఎల్‌డీఎఫ్, ఆరు చోట్ల యూడీఎఫ్, ఒక చోట ఎన్డీయే ఆధిక్యం కొనసాగుతోంది. ఇక కొల్లం, ఇడిక్కిలో ఐదు సీట్లలో నాలుగింటిలో యూడీఎఫ్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. అటు ఎర్నాకుళం ఏరియాలో 14 సీట్లలో యూడీఎఫ్-9, ఎల్‌డీఎఫ్-5, మల్లప్పరంలో 16 సీట్లలో యూడీఎఫ్- 15, వయనాడులో 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live