Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

Big TV Live 1 week ago

KTR Remarks: తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగాడిద రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశమంతా ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశ ప్రజలు ఒదిలించుకున్నారని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని అమాయకంగా నమ్మి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు నిజం తెలుసుకుని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.

Aso Read: టీచర్ల జీతాల్లో పైసలు కట్.. ఏ హాస్పిటల్‌కు వెళ్లాలో చెప్పని ప్రభుత్వం!

50 శాతం టైం అయిపోయింది..?

అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ అని అన్నారు. రాష్ట్రంలో వీరికి 50 శాతం టైం అయిపోయింది ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా కొన్ని రోజుల్లో ఎవరు కూడా వీరిని పట్టించుకోరంటూ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం పోయాక సీఎం రేవంత్ రెడ్డిని చూసి, చిక్కడ్ పల్లి లైబ్రేరికి రాకుండా చిక్కడు దొరకడు అనేలాగా రేవంత్ తప్పించుకుని తిరుగుతాడని అన్నారు. రైతు బంధు బంద్ అయ్యి రాహుల్ బంధు స్టార్ట్ అయ్యిందంటూ కేటీఆర్ ఎద్దేవ వేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల చేతిలోకి వెళ్ళిందన్నారు. 2028 డిసెంబర్‌లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live