Khammam: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగ యువతకు ఉపాధి దిశగా మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి.
శ్రీజ తో కలిసి పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, తదితర రంగాలకు చెందిన 80 కంపెనీలు పాల్గొని సుమారు 3200 పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మే 23న నియామక పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువత ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉండకుండా, ప్రారంభంలో వేతనం తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని స్వీకరించి అనుభవాన్ని సంపాదించు కోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ.. యువత ఉద్యోగ జీవితంలోకి అడుగిడితే ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు దోహదకారి అతుందని, అలాగే అనుభవం కూడా లభిస్తుందని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్, డీట్, జిల్లా అధికారులు, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ఈడిఎం దుర్గాప్రసాద్, డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

