Kissik Talks:ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు వరుసగా పుట్టుకొస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆడియన్స్ కోరిక మేరకు ఈ టాక్ షోలు కూడా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరిస్తూ మంచి టాక్ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఈసారి గెస్ట్ గా వచ్చేసింది ప్రియా శెట్టి. అగ్నిపరీక్ష టాస్క్ లతో తనను తాను నిరూపించుకొని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందం, అభినయంతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ లోకి వచ్చిన 3వ వారమే ఎలిమినేట్ అయ్యి.. బయటకు వచ్చేసింది. దీంతో ఈమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ లవర్స్ కూడా కామెంట్లు చేశారు. అయితే ఇలా హౌస్ లోకి వచ్చిన మూడు వారాలకే ఎలిమినేట్ అవ్వడంపై తాజాగా ఈ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో ప్రియా శెట్టి మాట్లాడింది.
అమెరికా ప్రయాణం ఆపుకొని బిగ్ బాస్ లోకి అడుగు..
“నేను అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నాను. కాకపోతే అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని.. ఇక్కడ బ్రతకడం కష్టమని నా స్నేహితులు చెప్పడంతో వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలో అమెరికా ప్రయాణాన్ని ఆపుకున్నాను. ఇక ఇండియాలోనే ఉండి తల్లిదండ్రులతో కలిసి చదువుకోవాలని ఎంబీఏ మెడిసిన్ ఎంట్రన్స్ కూడా రాశాను. అయితే అడ్మిషన్ తీసుకునే లోపే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుండి కాల్ రావడం.. నా జీవితాన్ని కొత్త దిశగా మలిచింది. ఇక తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాను. అయితే హౌస్ లో నేను అగ్రెసివ్ గా ప్రవర్తించానని విమర్శలు వచ్చాయి. నిజానికి నేను చాలా క్యూట్.. అయితే షోలో నేను గట్టిగా మాట్లాడిన వైఖరిని మాత్రమే హైలెట్ చేశారు.

