Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్లైమాక్స్ వరకు ఇలాంటి హీస్ట్ సినిమాలను చూస్తే పిచ్చెక్కిపోద్ది

క్లైమాక్స్ వరకు ఇలాంటి హీస్ట్ సినిమాలను చూస్తే పిచ్చెక్కిపోద్ది

Big TV Live 6 days ago

Best Heist Movies on OTT : కొన్ని సినిమాలు చూస్తుంటే అస్సలు ఊపిరి ఆడదు. స్క్రీన్ మీద వాడు ప్లాన్ వేస్తుంటే మనకు చెమటలు పడతాయి. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి గుండె జారి గల్లంతవ్వడం ఖాయం.

పక్కా స్కెచ్‌తో, బీభత్సమైన యాక్షన్‌తో మైండ్ పోయేలా చేసే అలాంటి ఐదు అదిరిపోయే హీస్ట్ సినిమాలు, అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం ఇప్పుడు.

1. డెన్ ఆఫ్ తీవ్స్ (Den Of Thieves – 2018)

ఈ సినిమాలో దొంగలు మామూలు దొంగలు కాదు, ట్రెయిన్డ్ మిలిటరీ లాంటోళ్లు. అమెరికా సెంట్రల్ బ్యాంకు లోని పాత నోట్లను కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తారు. వాళ్లని పట్టుకోవడానికి ఒక సైకో పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ దిగుతుంది. ఇందులో ఇంటర్వెల్ దగ్గర వచ్చే గన్ ఫైట్ సీన్ చూస్తే పూనకాలు వచ్చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించడం ఎవడి తరం కాదు. స్క్రీన్ మీద ఇద్దరు మొనగాళ్లు తలపడితే ఎలా ఉంటదో ఈ సినిమా చూపిస్తుంది. Amazon Prime Video, Lionsgate Playలో ఇది అందుబాటులో ఉంది.

2. హెల్ ఆర్ హై వాటర్ (Hell Or High Water – 2016)

ఇందులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ల అమ్మ చనిపోయాక, వాళ్ల సొంత భూమిని బ్యాంకోడు లాక్కోవాలని చూస్తాడు. దాంతో కోపమొచ్చిన ఈ అన్నదమ్ములు, ఏ బ్యాంకైతే తమని ముంచిందో, అదే బ్యాంకు బ్రాంచ్‌లను వరసపెట్టి దోచేయడం మొదలుపెడతారు. వాళ్లని వేటాడటానికి ఒక పోలీస్ కూడా ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇది ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సినిమా కాదు కానీ ఎమోషన్ పీక్స్‌లో ఉంటుంది. దొంగతనం వెనుక ఉన్న రీజన్ వింటే గుండె బరువెక్కుతుంది. అలాగే క్లైమాక్స్ వరకు టెన్షన్ నరాలు తెగేలా ఉంటుంది.
Netflix, SonyLIVలో ఇది అందుబాటులో ఉంది.

3. బేబీ డ్రైవర్ (Baby Driver – 2017)

ఇందులో హీరో పేరు ‘బేబీ’. అతను డ్రైవింగ్ లో పెద్ద తోపు. దొంగతనం చేసిన గ్యాంగ్‌ని తన కార్లో ఎక్కించుకుని, పోలీసుల కళ్లు గప్పి పారిపోవడంలో ఇంకా తోపు. అయితే అతను ఈ క్రైమ్ ప్రపంచం నుండి బయటపడాలని అనుకుంటాడు. కానీ వాడి బాస్ ఒప్పుకోడు. చివరి దోపిడీ వాడి జీవితాన్ని ఎలా మార్చిందనేది కథ. ఈ సినిమాలో కార్ ఛేజింగ్ సీన్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కార్ గేర్లు మార్చే సౌండ్లు ఒక సింఫనీలా సింక్ అవుతాయి. అస్సలు బోర్ కొట్టని అల్టిమేట్ రైడ్ ఇది.
దీనిని Netflix, Amazon Prime Videoలో చూడచ్చు.

4. ది టౌన్ (The Town – 2010)

బోస్టన్ నగరంలో ఒక పెద్ద దొంగల ముఠా ఉంటుంది. వాళ్లు బ్యాంకులు, క్యాష్ వ్యాన్లు దోచేయడంలో దిట్ట. ఒక దోపిడీలో బ్యాంకు మేనేజర్ అయిన ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత వదిలేస్తారు. కానీ హీరో ఆ అమ్మాయితోనే ప్రేమలో పడతాడు. ఇటు పోలీస్ నిఘా, అటు గ్యాంగ్ ప్రెజర్ మధ్య హీరో ఏం చేశాడనేదే ఈ కథ. ఇదొక క్లాసిక్ హీస్ట్ డ్రామా. క్లైమాక్స్‌లో వచ్చే స్టేడియం దోపిడీ సీన్ చూస్తున్నప్పుడు సీట్లో కూర్చోలేవు. దీనిని Amazon Prime Video, Apple TV లో చూడచ్చు.

5. ఓషన్స్ ఎలెవెన్ (Ocean’s Eleven – 2001)

జైలు నుండి బయటకు వచ్చిన డానీ ఓషన్ అనే ఒక కింగ్ పిన్, లాస్ వెగాస్‌లోని మూడు అతిపెద్ద క్యాసినోలను ఒకే రాత్రిలో దోచేయాలని ఫిక్స్ అవుతాడు. దానికోసం 11 మంది తోపు దొంగలను వెతికి పట్టుకొచ్చి ఒక టీమ్ లాగా మారుస్తాడు. 150 మిలియన్ డాలర్ల డబ్బును వాళ్లు ఎలా కొట్టేశారనేదే ఈ సినిమా కథ. హీస్ట్ సినిమాలకు ఇది అమ్మ మొగుడు లాంటి సినిమా. ఇందులో వైలెన్స్ ఉండదు, అంతా మైండ్ గేమ్. హాలీవుడ్ సూపర్ స్టార్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు. స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్‌గా ఉంటుందంటే, కనురెప్ప వేసేలోపు సీన్ మారిపోతుంది. Jio hotstaar, Amazon Prime Videoలో దీనిని చూడచ్చు.

Read Also : అవమానించిన వాళ్ల ముందే మిడిల్ క్లాస్ అబ్బాయి అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన బాసిల్ జోసెఫ్ సినిమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live