ODI world cup 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చిన నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ ( ODI world cup 2027) గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఈ టోర్నమెంట్ ప్రారంభానికి మరో ఏడాది కాలం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచి జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి ఆయా క్రికెట్ బోర్డులు. ఇలాంటి క్రమంలో ఆఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు (Afghanistan Cricket Team) ఊహించని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడకుండా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు. ఐసీసీ కఠినమైన రూల్స్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ ఆడకుండా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పై బ్యాన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద జోకర్..నఖ్వీ అమ్ముడుపోయే కుక్క…PCB సెలక్షన్‌పై పాక్ ప్లేయర్ తిరుగుబాటు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పై బ్యాన్ ఎందుకంటే ?
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడబోదని తెలుస్తోంది. ఐసీసీ అమలు చేస్తున్న కఠినమైన రూల్స్ ప్రకారం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుపైన బ్యాన్ విధించబోతున్నారట. దీనికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్ సర్కార్ కారణమని తెలుస్తోంది. మహిళలు క్రికెట్ ఆడకూడదని తాలిబన్ సర్కార్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. అయితే ఐసీసీ టోర్నమెంట్లలో ఆడాలంటే పురుషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల టీమ్ కూడా ఉండాలి. కానీ ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున కేవలం పురుషుల జట్టు మాత్రమే ఆడుతోంది. మహిళలపై తాలిబన్స్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఉమెన్స్ ఆఫ్గనిస్తాన్ జట్టు ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. ఈ ఒక్క కారణం వల్ల ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుకు ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు జట్లు ఉంటేనే 2027 వన్డే వరల్డ్ కప్ లో పురుషుల ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అవకాశం కల్పిస్తారట. అంటే ఈ లెక్కన 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆడబోదు అన్నమాట. ఇదే జరిగితే ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( Afghanistan) కోట్లల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ధైర్యం చేసి..ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పై ఐసీసీ బ్యాన్ విధిస్తుందా ? లేదా లైట్ తీసుకుంటుందా ? అనేది చూడాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్ 2027 ఎప్పుడంటే ?
2027 వన్డే వరల్డ్ కప్ ( ODI world cup 2027) వచ్చే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే తో పాటు నమీబియా దేశాలలో ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే మొత్తం 14 జట్లు.. 54 మ్యాచ్ లు ఆడతాయి. ఇందులో మెజారిటీ మ్యాచ్ లు దక్షిణాఫ్రికాలో జరుగనున్నాయి.

