Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big TV Live 5 days ago

Police Attack: ఆస్పత్రి బెడ్‌పై కాళ్లకు కట్లతో, చేతులకు పట్టీలతో కనిపిస్తున్న వీడిని చూసి.. అయ్యోపాపం అని జాలి పడకండి. వీడు ఏం చేశాడో తెలిస్తే తగిన శాస్తే జరిగిందంటారు.

ఈ రాస్కెల్ ఇప్పుడు బెడ్‌పై కామ్‌గా పడుకొని ఉన్నాడు. కానీ నిన్న వీడు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.

కత్తి దూసి కానిస్టేబుల్ పై..

ఈ బద్మాష్‌గాడి పేరు అవినాద్.. పేరు మోడ్రన్‌గానే ఉంది. కానీ వీడు చేసే పనులు అడవిమనిషిని తలపిస్తాయి. అసలే వీడు కోతిలా ఉన్నాడు. పైగా బాడీకి ఫుల్ డ్రగ్స్ ఎక్కించాడు. ఇక వాడు కంట్రోల్‌లో ఉంటాడా. కళ్లు తేలేసి ఆవేశంతో ఊగిపోతూ.. ఒళ్లంతా మైకం.. వాడిదో సెపరేట్ లోకం. కృష్ణా జిల్లా దేవరపల్లి కోమటిగుంట లాకుల దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చాడు అవినాద్. తూలుతూ, తడబడుతూ కనిపించిన వాడి వాలకం చూడగానే తేడాకొట్ఇంది. పోలీసులు వాడిని అడ్డుకోగానే.. కోపంతో రగిలిపోయాడు. కత్తి దూసి కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై అటాక్ చేశాడు. పాపం ఆయన కిడ్నీ తీవ్రంగా దెబ్బతిన్నది.

Also read: ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

కత్తితో శ్రీనివాస్ చాతిపై..

పోలీసులను చిన్న మాట అంటేనే తోలు తీసి చేతిలో పెడతారు. అలాంటిది కత్తితో పొడిస్తే ఊరుకుంటారా? వాడి జాడ కోసం ఊరువాడ వెతికారు. కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర ఉన్నాడని తెలుసుకున్నారు పోలీసులు. రాత్రి 11 గంటల సమయంలో సీఐలు, కానిస్టేబుళ్ల టీమ్‌ స్పాట్‌గా చేరుకుంది. ఈ వెదవకు మత్తు దిగనట్టు ఉంది. పోలీసులపై మళ్లీ అటాక్ చేయడం ప్రారంభించాడు. చేతికి దొరికిన రాళ్లను తీసి పోలీసులపై విసిరాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ నెమ్మదిగా అవినాద్‌ను దగ్గరికి వచ్చి పట్టుకోవాలని చూశాడు. ఆ మత్తు కళ్లతో ఎలా పసిగట్టాడో గానీ కత్తితో శ్రీనివాస్ చాతిపై పొడిచాడు. మరికొంత మంది కానిస్టేబుళ్లపై కూడా కత్తులు దూసాడు.

రెండు కాళ్లకు తుపాకీ తూటాలు..

పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థంకావడం లేదు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అవినాద్‌ రెండు కాళ్లకు తుపాకీ తూటాలు తగిలి కిందపడిపోయాడు. మత్తోన్మాదులు రెచ్చిపోతున్నారు. వాహనాలతో అడ్డొచ్చిన వారిపై దూసుకెళ్తున్నారు. పోలీసులు, సామాన్యులు అనే తేడాలేకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి వారిని ఇలా కాళ్లు విరిచి మూలకు కూర్చొట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also read: సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live