Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్షణక్షణం ఉత్కంఠ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో.. ఓటీటీని దున్నేస్తున్న మూవీ!

క్షణక్షణం ఉత్కంఠ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో.. ఓటీటీని దున్నేస్తున్న మూవీ!

Big TV Live 1 month ago

OTT Movies: ఈ మధ్యకాలంలో థియేటర్లలో అన్ని జానర్ సినిమాలు విడుదలైనప్పటికీ ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి. అందుకే ప్రేక్షకుడి అవస్థలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.

పైగా ఈ సమ్మర్ హాలిడేస్ ను మరింత ఎంజాయ్ చేయడానికి భిన్న విభిన్నమైన జానర్ లలో ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాలను తీసుకొస్తున్నాయి ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్. ఇకపోతే వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలలో విడుదలవుతూ సినిమా ప్రేక్షకులను టీవీకే కట్టిపడేస్తున్నాయి. అలా ఇప్పటికే ఒకవైపు థియేటర్లలో మే 1న శుక్రవారం రోజున జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాలు విడుదలయి ఆకట్టుకుంటుంటే.. మరొకవైపు ఇటు ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు అగరగొడుతున్నాయి. అలా ఒక సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ లో సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇప్పుడు ఒక సినిమా విపరీతంగా నచ్చేసింది అనే చెప్పాలి. ప్రతి సీన్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఓటీటీలో మెప్పిస్తున్న వేళ అలాంటి ఈ సినిమా ఇప్పుడు మరింత జోరు పెంచేసింది. అదే ఒక తమిళ సినిమా పోర్ తొళిల్. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిల విమల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఆ సైకో కిల్లర్ ఎవరిని చంపుతాడు? ఎందుకు చంపుతాడు? అసలు ఆ కిల్లర్ ఎవరు? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీ లివ్లో ఈ సినిమా అందుబాటులో ఉంది . ఈ సినిమాకి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ తమిళ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఇక ఆడియన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన ఈ సినిమాను, అందులోని ట్విస్ట్ లను మీరు మిస్ అవ్వకూడదు అంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

పోర్ తొళిల్ సినిమా స్టోరీ..

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అడిషనల్ డీజీపీ మహేంద్ర ఆదేశాల మేరకు ఎస్పీ లోకనాథన్ వద్ద డిఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాష్ (అశోక్ సెల్వన్)వస్తాడు. అతడితోపాటు టెక్నికల్ అసిస్టెంట్ వీణా( నిఖిల విమల్) కూడా వస్తుంది. తిరుచ్చి లో జరిగిన ఒక యువతి హత్య కేసు విచారణ చేసే బాధ్యత ఈ ముగ్గురిపై పడుతుంది. విచారణ చేస్తుండగానే వరుసగా మరికొన్ని హత్యలు జరుగుతాయి. మొదట మృతి చెందిన యువతి తో పాటు మరి కొంతమంది అమ్మాయిలా హత్యల వెనుక ఉన్నది ఎవరు? అందుకు కారణాలేంటి ? ఈ క్రమంలో ప్రకాష్, వీణా, లోకనాథన్ లకు ఎదురైన పరిస్థితులు ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ క్రైమ్ మూవీలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. నేరానికి కారకుడైన వ్యక్తి ఎవరో చివరి వరకు తెలియకుండా సాగే కథలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక దర్శకుడు విగ్నేష్ ఎంచుకున్న పాయింట్ ను చాలా కొత్తగా ప్రజెంట్ చేసి చివరి వరకు ఆ టెంపో ని అలాగే కొనసాగించి.. ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు ఉత్కంఠతో కూర్చోబెట్టడంలో ఆయన విజయం సాధించారు. మరి మీరు కూడా ఈ సినిమాను ఒకసారి చూసేయండి.

రెండేళ్లయిన తగ్గని క్రేజ్..

ఇకపోతే ఈ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్ బాస్టర్ మూవీ 2023 ఆగస్టు 11న సోనీ లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అలా స్ట్రీమింగ్ కి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అవుతున్నా ఇంకా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

also read:ఎన్టీఆర్ తో ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్.. నీళ్ మావా నీ బుర్రే బుర్ర?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live