Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

Big TV Live 3 weeks ago

Priyanka Chopra's Viral Video:ప్రియాంక చోప్రా.. వరల్డ్ వైడ్ గా ఈమెకున్న క్రేజ్ చెప్పక్కర్లేదు.అయితే నేను ఎంత పెద్ద స్టార్ ని అయినా నా కూతురికి మాత్రం అమ్మనే అంటుంది.అవును … తాజాగా ప్రియాంక పెట్టిన ఓ వీడియోనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.ఇక ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

“నాలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు మామా.. ఇంకొకరు మమాసిటా” అంటూ ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. వీడియో మొదట్లో చిన్నారి మాల్టీని ఒడిలో కూర్చోబెట్టుకుని దుర్గాసప్తశతి మంత్రాలు నేర్పిస్తున్న వీడియో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి, దేవుళ్లపై భక్తి, మన సంప్రదాయాలు కూతురికి అలవాటు చేయాలని ప్రియాంక ప్రయత్నించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. అమెరికాలో ఉంటున్నా.. తన మూలాలను మాత్రం మర్చిపోలేదని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.

అయితే అదే వీడియోలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మంత్రాలు చెప్పిన ప్రియాంక.. కాసేపటికే స్టైలిష్ డ్రెస్సులో డాన్స్ ఫ్లోర్‌పై అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఒకవైపు ప్రేమగా కూతురిని చూసుకునే అమ్మ.. మరోవైపు స్టేజ్‌పై అదరగొట్టే గ్లామర్ స్టార్. ఈ రెండు కోణాలు ఒకే వీడియోలో చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. “ఇదే ప్రియాంక స్పెషల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక

2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక.. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఆ పెళ్లి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 2022 జనవరి 15న సరోగసీ ద్వారా మాల్టీ మేరీ జన్మించింది. అప్పటి నుంచి ఈ జంట కూతురి ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూనే ఉంది.

కొద్ది రోజుల క్రితం కూడా ప్రియాంక ఓ ఎమోషనల్ ఫొటోను షేర్ చేసింది. అందులో మాల్టీ తన అమ్మమ్మ డాక్టర్ మధు చోప్రా చేతిని పట్టుకుని స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తూ కనిపించింది. పింక్ టాప్, వైట్ ప్యాంట్‌లో మాల్టీ చాలా క్యూట్‌గా కనిపించింది. “Reunited” అంటూ ప్రియాంక పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అమ్మమ్మ-మనవరాలి బంధాన్ని చూసి అభిమానులు తెగ మురిసిపోయారు.

ఇలా ఒక రోజు వస్తుందని ఎవరు అనుకున్నారు?

ఇంకో వీడియో అయితే మరింత స్పెషల్‌గా మారింది. టీవీ ముందు కూర్చున్న మాల్టీ.. తన అమ్మ నటించిన ‘గుండే’సినిమాలోని ‘ట్యూన్ మారీ ఎంట్రియాన్’పాటను ఎంతో ఆసక్తిగా చూస్తూ కనిపించింది. తన సినిమానే కూతురు ఇంత మునిగిపోయి చూస్తుండటంతో ప్రియాంక కూడా ఎమోషనల్ అయింది. “ఇలా ఒక రోజు వస్తుందని ఎవరు అనుకున్నారు?” అంటూ పోస్ట్ పెట్టి భర్త నిక్ జోనాస్‌ను ట్యాగ్ చేసింది. ఆ వీడియో కూడా క్షణాల్లో వైరల్ అయింది.

ప్రస్తుతం ప్రియాంక వారణాసి సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ షూట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. అయినా కూతురితో గడిపే చిన్న చిన్న క్షణాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ముఖ్యంగా విదేశాల్లో పెరుగుతున్న మాల్టీకి తెలుగు రాకపోయినా భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, దేవీ మంత్రాలు నేర్పించడం చూసి మా pc అంటే మాములుగా ఉండదు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ప్రియాంక ఫ్యాన్స్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live