Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యూఆర్ కోడ్ మూలల్లో.. ఆ నల్లటి డబ్బాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

క్యూఆర్ కోడ్ మూలల్లో.. ఆ నల్లటి డబ్బాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

Big TV Live 2 weeks ago

QR Code Secrets: ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూర్ కోడ్ (QR Code) స్కానర్లే దర్శనమిస్తున్నాయి. స్కాన్ చేయడం ద్వారా సెకన్లలో లావాదేవీలు పూర్తవుతున్నాయి.

అయితే ఈ QR కోడ్‌ ప్లేట్ ను ఎప్పుడైనా గమనిస్తే.. దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి చతురస్కారాపు బాక్సులు కనిపిస్తుంటాయి. నాల్గో మూల మాత్రం ఎలాంటి బాక్స్ లేకుండా సాధారణం గీతలతో ఉండిపోతుంది. అసలు ఆ మూడు బాక్సుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? వాటిని దేని కోసం డిజైన్ చేశారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్

ఆ మూడు చతురస్రాలను సాంకేతిక భాషలో ‘పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్’ అని పిలుస్తారు. మీరు కెమెరాను ఏ కోణంలో (Cross, Upside Down, Straight) ఉంచి స్కాన్ చేసినా.. ఆ మూడు బాక్స్ లు సరైన దిశ ఏంటో తెలియజేస్తాయి. ఫోన్ ఏ యాంగిల్‌లో ఉన్నా సెకను కంటే తక్కువ సమయంలో కోడ్‌ను సరిగ్గా చదవడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

నాల్గో మూల ఖాళీ ఎందుకు?

మూడు మూలల్లో చతురస్ర బాక్స్ లు ఉండటం వల్ల కోడ్ పెర్ఫెక్ట్ పొజిషన్ ను కెమెరా గుర్తించగల్గుతుంది. ఒకవేళ నాల్గో మూలలో కూడా బాక్స్ ఉంటే.. కోడ్ నేరుగా ఉందో లేదా తలకిందులుగా ఉందో గుర్తించడంలో స్కానర్ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నాల్గో మూలలో బాక్స్ లేకపోవడం వల్ల.. కోడ్ కు సంబంధించిన టాప్-లెఫ్ట్, టాప్-రైట్, బాటమ్-లెఫ్ట్ భాగాలను కెమెరా స్పష్టంగా గుర్తించగలదు.

ఇంతకీ క్యూఆర్ కోడ్ ఎలా పుట్టింది?

1994లో జపాన్‌కు చెందిన ‘డెన్సో వేవ్’ (Denso Wave) సంస్థ ఆటోమొబైల్ పార్ట్‌లను వేగంగా ట్రాక్ చేయడానికి దీనిని క్యూఆర్ కోడ్ ను డిజైన్ చేసింది. సాధారణ బార్‌కోడ్‌ల కంటే 100 రెట్లు వేగంగా.. అత్యధిక సమాచారాన్ని స్టోర్ చేసుకునేలా వీటికి రూపకల్పన చేసింది. కాలక్రమేణా అది ఆర్థిక రంగంలోకి విస్తరించి.. యూపీఐ పేమెంట్లకు కీలకంగా మారిపోయాయి.

దుమ్ము ధూళి ఉన్నా నో ప్రాబ్లం

టీకొట్టు, కిరాణా షాప్స్, మాల్స్ లో కనిపించే క్యూఆర్ కోడ్‌లో ‘ఎర్రర్ కరెక్షన్’ (Error Correction) సాంకేతికత ఇన్ బిల్ట్ గా ఉంటుంది. దీనివల్ల క్యూఆర్ కోడ్ పై కాస్త దుమ్ము పడినా, 30% వరకు చిరిగిపోయినా కూడా ఆ మూడు చతురస్రాల సహాయంతో కెమెరా మిగిలిన డేటాను సరిగ్గా అంచనా వేసి స్కాన్ చేయగలదని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live