Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోకేశ్‌తోనే మొదలుపెడదాం.చంద్రబాబు 'పాపులేషన్' కామెంట్స్‌పై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

లోకేశ్‌తోనే మొదలుపెడదాం.చంద్రబాబు 'పాపులేషన్' కామెంట్స్‌పై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

Big TV Live 1 week ago

Poonam Counter :ముగ్గురు వద్దు ..ఒక్కరు ముద్దు అన్న సామెత మనకి బాగా తెలుసు. జనాభా విపరీతంగా పెరిగిపోతుందని ఇలా అయితే ముందు ముందు బ్రతకడం చాలా కష్టమంటూ నియంత్రణ పాటించాలని దేశ వ్యాప్తంగా ఏంతో మంది ఈ సామెతని బాగా ప్రచారం చేసిన సంగతి తెల్సిందే.

ఇక చంద్రబాబు కూడా ఈ ప్రచారానికి మద్దతిచ్చిన వారే.కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది.ఏపీలో యువకుల శాతం బాగా శాతం తగ్గిపోతోందని, భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందంటూ,ఒక్కొకరు ముగ్గురు, నలుగురిని కనాలంటూ చంద్రబాబు సరికొత్త ప్రచారాన్ని మొదలెట్టడం ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.

చంద్రబాబు మాట్లాడుతూ ..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబంలో మూడో బిడ్డను కంటే రూ. 30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ. 40 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామంటూ సరికొత్త ప్రపోజల్ ని తెరమీదికి తెచ్చారు.ఒకప్పుడు జనాభాని వద్దన్న చంద్రబాబే ఇపుడు ఇలాంటి కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో సెలెబ్రెటీ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

రేణుకా చౌదరి ఘాటుగా స్పందిస్తూ

ముఖ్యంగా ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ రేణుకా చౌదరి ఎక్స్ (ట్విట్టర్) లో ఘాటుగా స్పందించింది.’చంద్రబాబు గారు ముగ్గురు, నలుగురు పిల్లలను కనమని చెబుతున్నారు సరే.. మరి భవిష్యత్తులో ఆ పిల్లల చదువులు, ఉద్యోగాలు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?’ అంటూ ఆమె ప్రశ్నించింది.ఇక రేణుకా చౌదరి ట్వీట్ సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయిందో లేదో వెంటనే పూనమ్ కౌర్ ఈ చర్చలోకి ఎంట్రీ ఇచ్చి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ వదిలింది.

లోకేశ్ బాబుతోనే ప్రారంభిద్దాం అంటూ పూనమ్ కౌంటర్

రేణుకా చౌదరి ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ‘ముందుగా ఈ విధానాన్ని లోకేశ్ బాబుతోనే ప్రారంభిద్దాం.. ఆయనకే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని మనం కోరుకుందాం’ అంటూ చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది పూనమ్ కౌర్.పనిలో పనిగా ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ లో సామాన్యుల పక్షాన నిలిచి ఇలాంటి సరైన ప్రశ్న అడిగినందుకు రేణుకా చౌదరికి ఆమె ఆమె థాంక్స్ చెప్పుకొచ్చింది కూడా.

also read :పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ 'బీస్ట్ మోడ్'.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!

పూనం కౌర్ సినిమాల విషయానికి వస్తే ‘మాయాజాలం’, ‘ఒక విచిత్రం’, ‘శౌర్యం’, అలాగే పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్.. సామాజిక, రాజకీయ అంశాలపై చాలా యాక్టివ్‌గా, బోల్డ్‌గా రియాక్ట్ అవడం మనకి తెల్సిందే . ఈ క్రమంలోనే చంద్రబాబు కామెంట్స్ పై ఆమె చేసిన ఈ ‘లోకేశ్’ కామెంట్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్‌పై తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్, కొందరు నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ పూనమ్‌ను ప్రశ్నిస్తూ.. ‘మేడమ్, ఈ ప్రశ్న అడిగిన వారు కాంగ్రెస్ పార్టీ నేత. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, సైబరాబాద్ లని మొదలెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి కంప్యూటర్లు, భవనాలు ప్రజలకు అన్నం పెట్టవంటూ ట్రోల్స్ చేశారు.కాని ఇప్పుడు అదే ఐటీ రంగాన్ని నమ్ముకుని లక్షల మంది బతుకుతున్నారు. చరిత్రే అన్నిటికీ సమాధానం చెబుతుంది.. కాబట్టి అవగాహన లేకుండా చంద్రబాబు లాంటి విజనరీ లీడర్‌ను విమర్శించవద్దు’ అంటూ పూనమ్ కి కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.

ఈ విమర్శకు పూనమ్ కౌర్ అంతే స్ట్రాంగ్‌గా ‘నేను చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. నిజానికి నేను స్కూల్లో చదువుకునే రోజుల నుంచే చంద్రబాబు గారు నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్. నా విద్యార్థి దశలో నా చేతికి మొదటి గోల్డ్ మెడల్ అందించింది కూడా ఆయనే. అందుకే అంత గొప్ప విజన్ ఉన్న నాయకుడు, ఒక వ్యవస్థను నిర్మించిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు నాకు మరింత బాధగా, ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ ట్వీట్స్ వార్ ఎక్కడిదాకా వెళ్తుందో

ఇక్కడ ఒక విధానాన్ని, నిర్ణయాన్ని తప్పుబట్టడం వేరు.. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం వేరు’ అంటూ పూనమ్ కౌర్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.ఇక చంద్రబాబుపై తనకు గౌరవం ఉందంటూనే.. ఎక్కువ మంది పిల్లల్ని కనమనే ఆయన పాలసీని మాత్రం తాను ఒప్పుకోనని కుండ బద్దలు కొట్టేసింది.మొత్తానికి చంద్రబాబు కి కౌంటర్ గా పూనమ్ వేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. చూడాలి మరి ఈ ట్వీట్స్ వార్ ఎక్కడిదాకా వెళ్తుందో !

also read :వైరల్ వీడియో.. పబ్లిక్‌గా 'బూతు' పదం వాడేసిన రష్మిక.. నెటిజన్లు ఫైర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live