Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా - జేసన్ సంజయ్

మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా - జేసన్ సంజయ్

Big TV Live 1 week ago

Jason Sanjay:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathy) ఈ ఏడాది తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ ద్వారా బరిలోకి దిగి..

అతి తక్కువ సమయంలోనే ఏకంగా ముఖ్యమంత్రిగా అధిష్టానం సొంతం చేసుకున్నారు. అలా ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ తమిళనాడు రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మరొకవైపు ఆయన హీరోగా నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇకపోతే విజయ్ చివరి సినిమా కావడంతో థియేటర్లలో ఆయన కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన పాత్రలకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేయగా.. థియేటర్లలో మళ్ళీ విజయ్ ని చూడలేమా? అంటూ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మా నాన్నతో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

అలాంటి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ (Jason Sanjay). విజయ్ పెద్ద కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఈ సినిమా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఆగస్టుకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు జేసన్ సంజయ్. ఇక ప్రమోషన్ లో భాగంగా మొదటిసారి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. తన తండ్రితో హాలీవుడ్ మూవీ తీస్తాను అంటూ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

అలా చూడకండి – జేసన్ సంజయ్

ఇంటర్వ్యూలో భాగంగా ముఖ్యమంత్రి కొడుకుని ఇంటర్వ్యూ చేయడం చాలా కొత్తగా ఉంది అని యాంకర్ అడగగా.. నన్ను అలా పిలవకండి.. చూడకండి.. ఎప్పటిలాగే నార్మల్గానే తీసుకోండి అంటూ బదులిచ్చారు. ఒకవేళ సిగ్మా హిట్ అయ్యి మిమ్మల్ని హాలీవుడ్ యాక్టర్ జాసన్ స్టాథమ్ తో సినిమా తీయమని పిలిస్తే, ఇండియా నుండి ఏ యాక్టర్ ని తీసుకెళ్తారు? అని అడగగా..” అలా ఆలోచన వస్తే నా మైండ్ లోకి వచ్చే మొదటి హీరో మా నాన్న ఇద్దరూ కోట్ సూట్ లో ఉంటే మంచి కాంబినేషన్లో ఉంటుంది”. అంటూ తెలిపారు. మొత్తానికైతే అవకాశం వస్తే తన తండ్రిని హాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకెళ్తానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒకవేళ అదే నిజమైతే విజయ్ తో హాలీవుడ్ మూవీ పట్టాలెక్కే అవకాశం కూడా లేకపోలేదు అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

నా జీవితంలో ఆ అనుభవాన్ని మర్చిపోలేను – జేసన్ సంజయ్

చిన్నప్పుడు మా నాన్నతో కలిసి మొదటిసారి సీఎస్కే మ్యాచ్ చూసిన అనుభవాన్ని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే కొంతకాలంగా విజయ్ కుటుంబం గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు, వివాదాలు వస్తున్న సమయంలో జేసన్ సంజయ్ తన తండ్రి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live