Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మారుతి ఫస్ట్.. టాటా సెకెండ్.. జూన్ 2026 కార్ల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ బ్రాండ్స్!

మారుతి ఫస్ట్.. టాటా సెకెండ్.. జూన్ 2026 కార్ల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ బ్రాండ్స్!

Big TV Live 1 week ago

June 2026 Auto Sales Report: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో జూన్ 2026 నెలలో కూడా మంచి అమ్మకాలు కొనసాగాయి. చాలా కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి.

కొన్ని బ్రాండ్లు నెలవారీ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి టాప్ పొజిషన్ ను మళ్లీ నిలబెట్టుకోగా, టాటా మోటార్స్ స్వల్ప ఆధిక్యంతో మహీంద్రాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో అమ్మకాల్లో సత్తా చాటిన టాప్ బ్రాండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి: 1,47,187

జూన్ నెలలో మారుతి సుజుకి మొత్తం 1,47,187 ప్యాసింజర్ కార్లను అమ్మింది. యుటిలిటీ వెహికల్స్ తో పాటు చిన్న కార్లకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా లాంటి మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయి. స్విఫ్ట్, డిజైర్, వాగన్ ఆర్, బాలెనో లాంటి కార్లు కూడా కంపెనీ అమ్మకాల్లో సత్తా చాటాయి.

2.టాటా మోటార్స్: 62,076

టాటా మోటార్స్ జూన్‌లో 62,076 కార్లను అమ్మి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహీంద్రాతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, సుమారు 1,700 యూనిట్ల ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇటీవల విడుదలైన సియెర్రా ఈవీపై మంచి రెస్పాన్స్ రావడంతో పాటు కంపెనీ తన ICE, EV మోడళ్ల ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది.

3.మహీంద్రా: 60,393

మహీంద్రా 60,393 SUVలను అమ్మి మూడో స్థానంలో నిలిచింది. స్కార్పియో-N, థార్, XUV 3XO, XUV 7XO లాంటి మోడళ్లకు మార్కెట్లో మాంచి సత్తా చాటాయి. SUV సెగ్మెంట్‌ లో కంపెనీ ప్రభావం ఇంకా బలంగానే కనిపిస్తోంది.

4.హ్యుందాయ్: 39,635

హ్యుందాయ్ జూన్‌ లో 39,635 యూనిట్లు విక్రయించింది. క్రెటా, వెన్యూ, ఎక్స్టర్ మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయి.

5.టయోటా: 28,441

టయోటా 28,441 కార్లను అమ్మి ఐదో స్థానంలో నిలిచింది. ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, గ్లాంజా మోడళ్లు కంపెనీ అమ్మకాల్లో సత్తా చాటాయి. త్వరలో కొత్త తరం హిలక్స్ పికప్‌ ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

6.కియా: 24,552

కియా జూన్‌ లో 24,552 యూనిట్లను అమ్మింది. సెల్టోస్, సోనెట్‌ కు మంచి డిమాండ్ కొనసాగుతుండగా, కేరెన్స్ క్లావిస్, సైరోస్ కూడా అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో కంపెనీ కేరెన్స్ క్లావిస్ EV కోసం BaaS ప్రోగ్రామ్‌ ను కూడా ప్రారంభించింది.

7.ఎంజీ మోటార్: 7,568

ఎంజీ మోటార్ 7,568 యూనిట్లతో మంచి వృద్ధిని నమోదు చేసింది. విండ్సర్ EV, కామెట్ EV, హెక్టర్ లాంటి మోడళ్లు కంపెనీ అమ్మకాలకు సపోర్టుగా నిలిచాయి. జూలైలో కొత్త న్యూ ఎనర్జీ వెహికల్‌ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

8.హోండా: 5,243

హోండా 5,243 కార్లను అమ్మింది. ఇటీవల విడుదలైన సిటీ ఫేస్‌ లిఫ్ట్‌ కు మంచి స్పందన రావడంతో పాటు ZR-V SUV బుకింగ్‌లు ప్రారంభం కావడం కంపెనీకి కలిసి వచ్చింది.

ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live