Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big TV Live 1 week ago

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఇటీవల విజయ్ దేవరకొండ రోమాంచకం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మందు తాగడం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోజు మద్యం తాగేవాడిని కానీ..

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ 2026 లో అత్యంత రోమాంచకమైన (ఉత్కంఠ భరితమైన) క్షణం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ..నేను 1989లో పుట్టాను, అప్పటి నుండి ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా గడిపాను. నా జేబులో డబ్బు ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, నేను బ్లెండర్స్ ప్రైడ్ మరియు గ్లెన్‌ఫిడిచ్ (రెండు స్కాచ్ విస్కీలు) తాగేవాడిని కానీ ఇప్పుడు నేను మద్యం తాగడం మానేశానని తెలిపారు.

హృదయ విదారకమైన అనుభవాన్ని పొందాను..

ఇలా ఉన్నఫలంగా మందు మానేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని విజయ్ దేవరకొండ తెలియచేయలేదు కానీ, ఇప్పటివరకు తన జీవితం గురించి గుర్తు చేసుకుంటూ…నేను ప్రేమలో పడ్డాను. హృదయ విదారకమైన అనుభవాన్ని పొందాను, పెళ్లి చేసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ, ఇది చాలా ఉత్కంఠభరితంగా ఉందంటూ ఈయన చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మద్యం తాగుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఉన్నఫలంగా మద్యం మానేయడానికి గల కారణం రష్మిక అయి ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

విజయ రష్మిక జంటగా రణబాలి..

ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మిక గత కొంతకాలంగా ప్రేమలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది పెద్దల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 26 న ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే సినిమాతో పాటు రణబాలి(Ranabaali) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ జోడిగా రష్మిక(Rashmika) నటించటం విశేషం. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live