Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళల క్రికెటర్లపై డబ్బులు పెట్టడం దండగ..ఆ జట్టును రద్దు చేయండి ?

మహిళల క్రికెటర్లపై డబ్బులు పెట్టడం దండగ..ఆ జట్టును రద్దు చేయండి ?

Big TV Live 3 days ago

Kapil Dev: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women's T20 World Cup tournament) రెండు రోజుల కిందట ముగిసింది. మొన్న ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరగగా… ఇందులో ఆస్ట్రేలియా చాంపియన్ గా నిలిచింది.

ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఈ క్రమంలో ఏడవ సారి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ గెలుచుకుంది ఆస్ట్రేలియా.

Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమి.. టీమిండియా పతనం మొదలైందంటూ అఫ్రిది సంచలనం !

మహిళల క్రికెటర్లపై డబ్బులు పెట్టడం దండగ

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) లో టీమిండియా మహిళల జట్టు గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ కావడంపై వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ (Kapil Dev) సీరియస్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచే అవకాశం వచ్చినా కూడా.. మహిళ క్రికెట్ జట్టు చేజేతులా పోగొట్టుకుందని మండిపడ్డారు. అనవసరంగా మహిళల క్రికెట్ జట్టుపై బీసీసీఐ డబ్బు ఖర్చు పెడుతుందని సీరియస్ అయ్యారు. వాళ్ల పైన పెట్టే డబ్బులను రిటైర్మెంట్ ఇచ్చిన క్రికెటర్లకు పెన్షన్ల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పెన్షన్ డబ్బులు పెంచితే, బాగుంటుందన్నారు.

50 ఓవర్ల వరల్డ్ కప్ సమయంలో అద్భుతంగా ఆడిన టీమిండియా మహిళల జట్టు… విదేశీ గడ్డపై మాత్రం దారుణంగా ఓడిపోయిందని మండిపడ్డారు. చాలా రోజుల నుంచి మహిళల క్రికెట్ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కోట్లల్లో డబ్బులు ఖర్చు చేస్తుందని… దానికి తగ్గట్టుగా ప్లేయర్ల ఆట తీరు లేదన్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మహిళల క్రికెట్ జట్టు ప్రదర్శన బయటపడిందని వెల్లడించారు. ఇలాంటి వాళ్లపై డబ్బులు పెట్టడం కంటే.. మహిళల క్రికెట్ జట్టును రద్దు చేయాలని కపిల్ దేవ్ కామెంట్స్ చేసినట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. ఈ క్రమంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిన పాకిస్తాన్, టీమిండియా

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో గ్రూప్ స్టేజిలోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ అయింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై అద్భుతంగా రానించి మొదటి మ్యాచ్ లోనే విక్టరీ అందుకున్న టీమిండియా (Team India) .. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. బలమైన జట్లపై ఓడిపోయిన టీమిండియా… రన్ రేట్ పరంగా వెనుకబడింది. ఈ క్రమంలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అంటే పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గ్రూప్ స్టేజిలోనే చిత్తుగా ఓడిపోయి… ఇంటి దారి పట్టింది.

Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్కడే ప్రపంచంలోనే భయంకరమైన బౌలర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live