Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

Big TV Live 1 week ago

Mahindra XEV 9S, XEV 9e Get BaaS:ఎలక్ట్రిక్ కార్లు కొనాలని చూస్తున్న వారికి మహీంద్రా సూపర్ ఆఫర్‌ ను తీసుకొచ్చింది. కంపెనీ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పథకాన్ని మరిన్ని ఎలక్ట్రిక్ కార్లకు విస్తరించింది.

ఇప్పటి వరకు తక్కువ మోడళ్లకే అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని తాజాగా XEV 9e, XEV 9Sలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. BaaS విధానంతో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. XEV 9S ధర రూ.12.65 లక్షల నుంచి, XEV 9e ధర రూ.13.90 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

రూ.8 లక్షల వరకు తగ్గిన ప్రారంభ ధర

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలో బ్యాటరీ ప్యాక్‌ చాలా కీలకం. BaaS విధానంలో బ్యాటరీ ధరను వెహికల్ ప్రారంభ ధర నుంచి వేరు చేస్తారు. దీంతో కారు కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన మొత్తం భారీగా తగ్గుతుంది. BaaS లేకుండా XEV 9S ప్రారంభ ధర రూ.20.65 లక్షలు కాగా, BaaSతో అది రూ.12.65 లక్షలకు వస్తుంది. అదే విధంగా XEV 9e ధర రూ.21.90 లక్షల నుంచి ఉండగా, BaaSతో రూ.13.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే రెండు మోడళ్లలోనూ ప్రారంభ ధర రూ.8 లక్షల వరకు తగ్గుతుంది. BaaSలో భాగంగా కిలోమీటరుకు రూ.3.75 వరకు బ్యాటరీ ఛార్జ్ చేస్తారు.

BE 6 స్పోర్టెక్‌కు కూడా వర్తింపు

మహీంద్రా BaaS ప్రయోజనాన్ని BE 6 స్పోర్టెక్ అన్ని వేరియంట్లకు విస్తరించింది. గతంలో ఈ పథకం చిన్న 59kWh బ్యాటరీతో ఉన్న ప్యాక్ వన్, ప్యాక్ టూ వేరియంట్లకే పరిమితమైంది. ఇప్పుడు స్పోర్టెక్ లైనప్‌ లోని అన్ని వేరియంట్లను BaaS కింద కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఒక్కో వేరియంట్‌కు సంబంధించిన కచ్చితమైన BaaS ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఇంతకీ BaaS అంటే ఏంటి?

BaaS అంటే Battery as a Service. సాధారణంగా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే సమయంలో కారు, బ్యాటరీ రెండింటి ధరను కలిపి చెల్లించాలి. కానీ, BaaS విధానంలో బ్యాటరీ ధరను వాహనం ప్రారంభ ధర నుంచి తొలగిస్తారు. దీంతో కొనుగోలు సమయంలో కారు ధర తక్కువగా కనిపిస్తుంది. అనంతరం బ్యాటరీ వినియోగానికి అనుగుణంగా కిలోమీటరుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్సింగ్ సంస్థను బట్టి చెల్లింపు కాలం, వడ్డీ రేటు వేరుగా ఉంటుంది. XEV 9e, XEV 9S, BE 6 స్పోర్టెక్‌కు ఈ పథకాన్ని విస్తరించడంతో మహీంద్రా విక్రయిస్తున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు BaaS స్కీమ్ లోకి వచ్చినట్లయింది. మన దేశంలో ఈ విధానాన్ని ముందుగా JSW-MG మోటార్ ఇండియా తమ విండ్సర్‌ తో తీసుకొచ్చింది. ఆ తర్వాత టాటా మోటార్స్, మారుతి, టయోటా, హ్యుందాయ్, సిట్రోయెన్ వంటి కంపెనీలు కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించాయి.

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live