Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైక్రో ఫైనాన్స్ కేసు. మంగ్లీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..అరెస్ట్ తప్పదా?

మైక్రో ఫైనాన్స్ కేసు. మంగ్లీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..అరెస్ట్ తప్పదా?

Big TV Live 3 weeks ago

Singer Mangli: సింగర్ మంగ్లీ ఏకంగా 100 కోట్ల రూపాయల స్కామ్ లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది అమాయకపు ప్రజలను మోసం చేస్తూ మైక్రో ఫైనాన్స్ పేరిట వందల కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి అయితే ఈ విషయంపై మంగ్లీ కూడా తన వాదనలను వినిపించారు.

ఈ కేసు విషయంలో తనకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదని, ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ మంగ్లీ తన వాదనను వినిపించారు. అయితే బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడం అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ మైక్రో ఫైనాన్స్ విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.

భారీగా నగదు బదిలీ..

ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా మంగ్లీ సోదరుడు శివ చౌహన్ అలాగే ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు లావాదేవీల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మధు బ్యాంక్ అకౌంట్లను చెక్ చేయగా మూడు విడతలలో భాగంగా మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతాకు భారీగా డబ్బు బదిలీ అయినట్టు స్టేట్మెంట్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన మరుసటి రోజే శివ ఆ నగదును విత్ డ్రా చేసినట్లు విచారణలో తేలింది.

చిక్కుల్లో సింగర్ మంగ్లీ..

ఇలా ఈ కేసు విషయంలో పక్క ఆధారాలు లభించడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ ను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ అకౌంట్ నుంచి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరిగాయనే విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖలు కూడా రాశారు . ఈ కేసు విషయంలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ చౌహన్ తమకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. కానీ వీరి ఖాతా నుంచి నగదు బదిలీ జరగడంతో మంగ్లీ కూడా చిక్కుల్లో పడుతోందని ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా నిజా నిజాలు బయటపడితే మంగ్లీ అరెస్ట్ అవడం కూడా తథ్యం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మైక్రో ఫైనాన్స్ కుంభకోణం..

మరి ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా బాధితుల నుంచి తీసుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఈమె ఏకంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో పాటు, డిజిపి, సజ్జనార్ వంటి వారిని కలిసి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేస్తున్నారంటూ ఈమె చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రమే ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live