Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు.. దర్యాప్తులో సంచలనాలు!

మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు.. దర్యాప్తులో సంచలనాలు!

Big TV Live 1 month ago

Mangli Microfinance Case: సింగర్​ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్​ కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రమావత్ మధు అకౌంట్​ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్​ ఖాతాకు డబ్బు బదిలీ అయినట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే, ఈ డబ్బు మైక్రో ఫైనాన్స్​ వ్యవహారంలో వసూలు చేసిందా? కాదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటికే రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్​ లకు చెందిన బ్యాంక్​ అకౌంట్ల స్టేట్ మెంట్లు, లావాదేవీల నివేదికలు ఇవ్వాలని పోలీసులు ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు.

వివరాల్లోకి వెళ్తే..

మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ చౌహాన్​, రమావత్​ మధు తదితరులు కలిసి హైదరాబాద్ లో పబ్​ నిర్వహిస్తున్నామని, అచ్చంపేటలో స్కూల్ ఉందని చెప్పి వాటి అభివృద్ధికి పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, చెప్పినట్టుగా ఏ ఒక్కరికీ వడ్డీ ఇవ్వలేదని బాధితులు తెలిపారు. డబ్బు వాపసు చేయమంటే చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, పటాన్​ చెరు జేపీ కాలనీ నివాసి, వ్యాపారి అయిన కట్రిక సంతోష్​ ఇటీవల రమావత్​ మధు, హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్​, పల్టియా భరత్, శైలజ తదితరులు రియల్ వెంచర్​ పేర తనను మోసం చేసినట్టు సైబరాబాద్ ఎకనమిక్​ అఫెన్సెస్​ వింగ్​ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

మూడుసార్లు నగదు బదిలీ

ఈ క్రమంలో పోలీసులు బీఎన్ఎస్​ యాక్ట్​ సెక్షన్​ 318(4), 316(2) సెక్షన్లతోపాటు డిపాజిట్​ దారుల హక్కుల పరిరక్షణా చట్టం సెక్షన్​ 5ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రమావత్ మధును ఇటీవలే అరెస్ట్​ కూడా చేశారు. దర్యాప్తులో భాగంగా రమావత్ మధు బ్యాంక్ ఖాతాలపై ఆరా తీయగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌ అకౌంట్‌కు రమావత్‌ మధు మూడుసార్లు నగదు బదిలీ చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఖాతాలో డబ్బు జమ అయిన రోజే శివ చౌహాన్​ విత్​ డ్రా చేసుకున్నట్టుగా తేలింది. అయితే, రమావత్​ మధు ఎంత మొత్తం నగదును ట్రాన్స్ ఫర్​ చేశాడు? మైక్రో ఫైనాన్స్​ వ్యవహారంలో వసూలు చేసిన డబ్బేనా? కాదా? అన్న వివరాలను అధికారులు వెల్లడించ లేదు.

BLDC vs Normal Fans: రెండూ సీలింగ్ ఫ్యాన్లే.. కానీ టెక్నాలజీలో ఎంత తేడానో.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

బ్యాంకులకు లేఖలు

కేసులో విచారణను ముమ్మరం చేసిన అధికారులు రమావత్‌ మధు, హిమకాంత్‌రెడ్డి, శివ చౌహాన్‌కు చెందిన అకౌంట్ల పూర్తి వివరాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తమ పేర్లను అనవసరంగా లాగుతున్నారని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ చెబుతున్నారు. ముందు ముందు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

హైయర్ కంపెనీకి చెందిన.. టాప్-5 బాటమ్ మౌంట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ఫీచర్లు చూస్తే ఫిదానే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live