Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big TV Live 2 weeks ago

Brishti Mukherjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మమతాకు వరసకు మేనకోడలైన 28 ఏళ్ల దేబాశ్రీ అలియాస్ బృష్టి ముఖర్జీ (Brishti Mukherjee)అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే..

బీర్భుమ్ జిల్లా (Birbhum district) కుసుంబ గ్రామంలో బృష్టి ముఖర్జీ నివసిస్తోంది. ఆమె మమతా బెనర్జీకి కజిన్ అయిన నిహార్ ముఖర్జీ కుమార్తె. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బృష్టి ఇంటి మొదటి అంతస్తులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాంపూర్ హట్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై రాంపూర్ హట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తాయని పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో ఆత్మహత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మానసిక ఒత్తిడే కారణమా?

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బృష్టి ముఖర్జీ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. దానికి చికిత్స కూడా ఆమె తీసుకుంటోంది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె తన భర్తతో విభేదాల కారణంగా విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

ఆమె ఉద్యోగంపైనా వివాదం..

ఇదిలా ఉంటే బృష్టి పొందిన టీచర్ ఉద్యోగానికి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్లో సంచలనం సృష్టించిన ప్రైమరీ టీచర్ నియామకాల కుంభకోణం ద్వారా ఆమె అక్రమంగా ఉద్యోగం సాధించారనే విమర్శలను బృష్టి ఎదుర్కొంటున్నారు. ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆమె ఉద్యోగాన్ని కోల్పోయారు. మానసిక, వైవాహిక సమస్యలతో పాటు జాబ్ గురించి వచ్చిన విమర్శలతో మనస్తాపానికి గురై ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live