Child Trafficking: స్వేచ్ఛ బ్యూరో: శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. ఆడ శిశువును 3 లక్షలకు అమ్మిన తల్లి తండ్రులు కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులు తమ 4 వ శిశువును అమ్ముకున్నారనే విషయం మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
ఇట్టి విచారణలో కన్న తల్లి తండ్రులు తమ పాపను 3 లక్షలకు అమ్ముకున్నారని నిర్దారించుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తగు చర్యల కొరకై ఫిర్యాదు చేయడం జరిగినది.
3 లక్షలకు..
పోలీసుల విచారణలో భాగంగా కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులకు ఇదివరకే 3 సంతానం ఉండగా తేదీ 27.3.2026 నాడు మెదక్ లోని MCH Hospital లో ఆడ పాప జన్మించడం జరిగినది. పాపను దంపతులిద్దరూ 3 లక్షలకు కొంత మంది మధ్యవర్తుల ద్వారా అల్లినగర్, ములుగు మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించడం జరిగినది. దీంతో ఈ విషయంపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పాపను తీసుకువచ్చి మహిళా శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు.
Also read: గోల్డ్ మార్కెట్‌లో 'భారత్ బాంబ్'.. ఒక్క ఏడాది కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచం తలకిందులేనా?
చట్ట ప్రాకారం..
అధికారులు సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పాపను తదుపరి సంరక్షణ నిమిత్తం సంగారెడ్డి లోని శిశుగృహ కు తరలించి ఆశ్రయం కల్పించారు. జిల్లాలో అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేస్తూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవలంటే ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

