Handloom Elections: స్వేచ్ఛ బ్యూరో: మెదక్ జిల్లాలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రి యలో భాగంగా, అర్హులైన ఓటర్లతో కూడిన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయబడిందని జిల్లా చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు (AD) ఒక ప్రక ట నలో తెలిపారు.
ప్రకటనలోని ముఖ్యాంశాలు
సభ్యత్వాల ఖరారు: సంబంధిత సహకార సంఘాలకు చెందిన సభ్యుల వివరాలు మరియు అర్హతా ప్రమాణాలను సహాయ సంచాలకులు (AD) స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, తుది సభ్యత్వ జాబితాను అధికారికంగా ఆమోదించారు.
సవరణల పూర్తి..
గతంలో విడుదల చేసిన ప్రాథమిక ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలు, పేర్ల సవరణలు మరియు చేర్పులను పరిష్కరిస్తూ, నిబంధనలకు కట్టుబడి ఈ జాబితాను రూపొందించారు.
తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్.. మస్తు ధీమాగా ఉన్న కమలం పార్టీ!
జాబితా ప్రదర్శన..
సభ్యుల సమాచారం కోసం, ఈ ఖరారైన వివరాలను మెదక్ లోని జిల్లా చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ కార్యాలయ నోటీసు బోర్డుపై, అలాగే సంబంధిత ప్రాథమిక చేనేత సహకార సంఘాల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల అధికారులకు ప్రతిపాదనల సమర్పణను ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేందుకు, సహాయం చేయనున్నారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం..
సంచాలకులు (AD) స్థాయిలో ఆమోదించబడిన ఈ తుది ప్రతిపాదనలను వీలైనంత త్వరగా రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు సమర్పిస్తామని ఆ అధికారి స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల ప్రక్రియ మొత్తం ఈ తుది జాబితా ఆధారంగానే నిర్వహించబడుతుందని నొక్కిచెప్పిన సహాయ సంచాలకులు, అర్హులైన సభ్యులందరూ ఈ ప్రకటనను గమనించాలని కోరారు.
Also read: యువతకు మంత్రి బంపర్ ఆఫర్.. చదువుతో పాటు చేతి ఖర్చులకి డబ్బులు!

