Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ పర్యాటక అందాలపై రీల్స్ చేయండి: కలెక్టర్ ప్రతిమా సింగ్!

మెదక్ పర్యాటక అందాలపై రీల్స్ చేయండి: కలెక్టర్ ప్రతిమా సింగ్!

Big TV Live 3 days ago

Medak Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్.జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.

గురువారం మెదక్ జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా టూరిజంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్‌పై ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండ్లర్లతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి చర్చించారు. రీల్స్ కాంపిటీషన్ విధివిధానాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బహుమతుల వివరాలు తదితర అంశాలను వారికి వివరించారు.

99 రోజుల ప్రజా పాలన

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాలలో భాగంగా మొదటిసారిగా వినూత్న పద్ధతిలో మెదక్ జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా ‘ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

4K వీడియో క్వాలిటీతో..

మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలపై 4K వీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాల్సి ఉంటుందని, ఆసక్తి కలవారు తమ వీడియోలను మే 21వ తేదీ నుంచి మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని, ఆన్‌లైన్ విధానంలో డీపీఆర్ఓ Raju 9949922291, ఏపీఆర్ఓ బాబు 9701306838 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని పేర్కొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి జూన్ 2వ తేదీన నగదు ప్రోత్సాహకాలు అందించబడుతుందన్నారు.

బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే.. మీ జీవితాన్ని అమ్ముకున్నట్లే.. సైబర్ క్రైమ్ డీసీపీ వార్నింగ్

జూన్ మాసం నుంచి..

మెదక్ జిల్లాలో ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి పర్యాటక కేంద్రాలు, జలపాతాలు, అభయారణ్య అందాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కలగలిసి అనేక పర్యాటక ప్రాంతాలు ప్రకృతి వైవిధ్యభరితంగా నెలవై ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ మాసం నుంచి పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని, వారందరికీ మెదక్ జిల్లా సాదర ఆహ్వానం పలుకుతుందన్నారు. రీల్స్ కాంపిటీషన్ ద్వారా మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు మంచి బ్రాండింగ్ వచ్చే విధంగా పూర్తి వివరాలతో, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రీల్స్‌ను రూపొందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో..

పర్యాటక దినోత్సవ టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. టూరిస్ట్ గైడ్ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు అట్టి దరఖాస్తులను నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, డైరెక్టర్, పురావస్తు మరియు మ్యూజియంల విభాగం డా. పి. నాగరాజు డిప్యూటీ డైరెక్టర్ (మ్యూజియంలు) ఎన్. నరసింగ్, డిప్యూటీ డైరెక్టర్ (ఇంజనీరింగ్)డిపిఆర్ ఓ రామచంద్ర రాజు, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్స్ తదితరులు పాల్గొన్నారు.

రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఇక బ్రేక్.. నోరు జారితే చేతికి బేడిలే..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live