Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ బిల్డర్లు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా..
సంబంధిత అధికారులు మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు భారీ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలు..
కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం తనిఖీల పేరుతో కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు సాధ్యమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిర్మాణాలు పూర్తయ్యాక కూల్చివేతల హడావుడి తప్ప.. ప్రారంభ దశలోనే అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!
అధికారుల నిర్లక్ష్యం..
ప్రజల నుంచి వరుస ఫిర్యాదులు వస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాలు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

